Certified vegetarian food in Vande Bharat trains తర్వలో వందేభారత్ సహా 18 రైళ్లు శాఖాహార రైళ్లే..

Vande bharat to katra to be pure veg as irctc aims for sattvik certificate

Vande Bharat Express, Vande Bharat news, Delhi Katra, IRCTC, indian railways, irctc, vegetarian food, non-vegetarian food, IRCTC, Sattvik certificate, Vegetarian Indian Railways, Indian Railway news, Indian Railway Catering and Tourism Corporation, vegetarian food, non-vegetarian food, IRCTC Latest News, IRCTC Latest Update, IRCTC News, irctc train booking, irctc website, irctc stock price

Indian Railways: Soon, train passengers will only get pure vegetarian food, but the facility will be available on selected routes. The railways ticketing and catering subsidiary, IRCTC, is planning to promote "vegetarian-friendly travel" by getting some trains "sattvik certified".

తర్వలో వందేభారత్ సహా 18 రైళ్లకు సత్విక్ సర్టిఫికేట్.. అవి నూరు శాతం శాఖాహార రైళ్లే..

Posted: 11/16/2021 04:13 PM IST
Vande bharat to katra to be pure veg as irctc aims for sattvik certificate

రైలు ప్రయాణంలో బయటి ఆహారం తినాలంటేనే అలోచించే శాకాహార ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. దేశంలోని పుణ్యక్షేత్రాలు, తీర్థాలతో పాటు మతపరమైన గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఉద్దేశించిన 'వందేభారత్‌' సహా పలు రైళ్లలో ప్రయాణించే పర్యాటకులు పూర్తిగా శాఖాహారాన్నే తీసుకోవాలని భావిస్తుంటారు. దీంతో రైళ్లలో అందుబాటులో ఉండే అహారాన్ని మాత్రం వారు తీసుకోరు. ఎందుకంటే అవి ఎలా తయారు చేశారన్న అంశం మొదలు.. వాటిలో వాడిని అయిల్ నుంచి వాటిని తయారు చేసిన కుక్ వరకు అన్నింటినీ వీరు పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇది పూర్తిగా శాఖాహారమే అని చెప్పినా.. వారు నమ్మేందుకు పలు సందేహాలు ముందుకోస్తాయి.

దీంతో ఈ తరహా ప్రయాణికులను నమ్మించడంలో భాగంగా రైల్వే శాఖ పలు రైళ్లకు సత్త్విక్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఈ ధృవపత్రాలు వందే భారత్ తో పాటు మరో 18 రైళ్లు త్వరలోనే అందుకోనున్నాయి. అంటే ఇకపై ఈ రైళ్లలో లభించే ఆహారమే కాదు.. వాటిలో వినియోగించే ప్రతీ వస్తువులో ఎలాంటి మాంసాహారానికి దూరంగా వుంటాయి. ఫలితంగా నచ్చిన డెస్టినేషన్‌కు ఎలాంటి అనుమానం లేకుండా, కడుపు మాడ్చుకునే పనిలేకుండా ఎంచక్కా వెళ్లి రావొచ్చు. రైళ్లకు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి.

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో కలిసి శాకాహార అనుకూల సేవలను ప్రారంభించిన సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఈ సర్టిఫికెట్ ఒక్క రైళ్లకు మాత్రమే పరిమితం కాదు. ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బడ్జెట్ హోటళ్లు, ఫుడ్ ప్లాజాలు, ట్రావెల్, టూర్ ప్యాకేజీలు, రైల్ నీర్ ప్లాంట్‌లు మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది. ‘వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రావెల్’పై మరింత నమ్మకాన్ని పెంచుతుంది. ఐఆర్‌సీటీసీ కిచెన్‌లోకి ప్రవేశించే ప్రతీది శాకాహారమేనని నిర్ధారిస్తుంది.

వేగాన్ సర్టిఫికెట్‌పై సాత్విక్ కౌన్సిల్ ఇండియా వ్యవస్థాపకుడు అభిషేక్ బిశ్వాస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. పర్యాటకుల్లో అత్యధికులు శాకాహారులేనన్నారు. తమ గమ్యస్థానాలకు వారిని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు, ఆహార సావనీర్‌లలో ధ్రువీకరించిన శాకాహారాన్ని అందించడం చాలా అవసరమన్నారు.  శాకాహార లభ్యత కారణంగా వారి ప్రయాణం మరింత ఆకర్షణీయంగా, ఆచరణీయంగా ఉంటుందన్నారు. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి శాకాహార ధ్రువీకరణను తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బ్యూరో వెరిటాస్ నార్త్ జోన్ జనరల్ మేనేజర్ బ్రిజేష్ సింగ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles