Centre cuts excise duty on petrol, diesel వాహనదారులకు కేంద్రం దీపావళి కానుక.. ఇంధనంపై సుంకం తగ్గింపు

Petrol diesel to get cheaper excise duty to be cut by rs 5 and rs 10

Petrol, Diesel, Petrol Diesel Taxes, Petrol diesel excise duty, Petrol diesel tax, excise duty on petrol, excise duty on diesel, petrol, petrol price today, diesel price, fuel price excise duty, Diwali

The excise duty on petrol and diesel will be reduced by ₹ 5 and ₹ 10 respectively from tomorrow, the government has announced on the eve of Diwali, aiming to provide relief to people reeling under the impact of spiralling fuel prices.

వాహనదారులకు కేంద్రం దీపావళి కానుక.. ఇంధనంపై సుంకం తగ్గింపు

Posted: 11/03/2021 08:32 PM IST
Petrol diesel to get cheaper excise duty to be cut by rs 5 and rs 10

దీపావళికి పండుగ ముందు దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో తమకు పట్టున్న స్థానాల్లోనూ పార్టీ పరాభవాన్ని మూటగట్టుకోగా, తమ అధికారం వున్న రాష్ట్రల్లోనూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు గెలుపోందడంతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి వాహనదారులకు వాత పెడితే.. ప్రజా తీర్పు ఎలా వుంటుందో కూడా అర్థమైంది. దీంతో ఎక్కువ సమయం తీసుకోని బీజేపి వెనువెంటనే ఇంధన ధరలపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు ఇవాళ ప్రకటనను వెలువరించింది. అయితే డీజిల్ రేటుపై నిత్యావసర సరుకుల ధరలు కూడా అధారపడటం కారణంగా లీటరు డీజిల్ ధరపై ఊహిరిపీల్చుకునే తరహాలోనే ఊరటను కల్పించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం, లీటరు డీజిల్‌పై ఏకంగా రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అయితే పెరిగిన ధరలను తక్షణం అమల్లోకి తీసుకువచ్చే కేంద్రం.. ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ జారీ చేసిన ప్రకటన ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.

ఇక ఇన్నాళ్లు వ్యాట్ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకువస్తామని చెప్పిన కేంద్రం.. తమ నిర్ణయానికి రాష్ట్రాలు అంగీకరించడం లేదని తేల్చిచెప్పేసింది. అయితే ఇప్పుడు కేంద్రం సుంకాన్ని తగ్గించగానే.. వాహనదారులకు మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని సూచించింది. ఇటీవల పెరుగుతున్న వచ్చిన ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.04గా ఉండగా, డీజిల్ లీటర్‌ రూ.98.42, ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.85, డీజిల్‌ రూ.106.62 ధర పలికింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట కలుగనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  Petrol Diesel Taxes  Petrol diesel excise duty  Petrol diesel tax  excise duty  

Other Articles