'Absentee' IPS Gets Odisha ADG Notice ’’ఐపీఎస్ అధికారిణి ఎన్.బి భారతి ఆచూకీ ఎక్కడ.?’’

Absentee ips officer gets odisha adg notice for appearance on oct 29

woman IPS officer, NB Bharathi, inspector general (IG), disciplinary proceedings, State Crime Records Bureau, Odisha HRPC, Odisha, Crime

The office of the additional director general (ADG) of Odisha Crime Records Bureau has issued a public notice asking woman IPS officer NB Bharathi to appear before it on October 29. Bharathi, a 1998-batch IPS officer posted as inspector general (IG) with the State police's Human Rights Protection Cell (HRPC), has been absent from her duty since long.

’’ఐపీఎస్ అధికారిణి ఎన్.బి భారతి ఆచూకీ ఎక్కడ.?’’

Posted: 09/09/2021 11:23 AM IST
Absentee ips officer gets odisha adg notice for appearance on oct 29

సెలవు తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా రెండేళ్లుగా విధులకు హాజరు కాని ఓ మహిళా ఐపీఎస్ అధికారి కనిపించడం లేదంటూ ఉన్నతాధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఒడిశాలోని కటక్ పోలీసులు అందులోనూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఈ ప్రకటనలు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లోనూ ఈ ప్రకటనలు ప్రచురితం కావడంతో ఇప్పడీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒడిశా క్రైం రికార్డ్స్ బ్యూరోకు ఏడీజీ ఈ మేరకు ఒక ఐపీఎస్ అధికారు అందులోనూ ఏకంగా ఇన్స్ పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న అధికారిని కనిపించకపోవడంతో, విధులకు హాజరుకాకపోవడంతో అమెపై చర్యలు తీసుకునేలా ఈ ప్రకటన వెలువరించారు,

ఈ కార్యలయం కథనం ప్రకారం.. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఐజీగా పనిచేస్తున్న భారతి రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. అలాగని సెలవు కూడా తీసుకోలేదు. ఉన్నతాధికారులకు కనీసం మౌఖికంగానైనా చెప్పలేదు. అమె విధులకు హాజరుకాకపోవడంతో అమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఒడిశా హోం మంత్రిత్వశాఖ 23 నవంబర్ 2017లో అదేశాలు జారీ చేసింది. అయినా అమె విధులకు హాజరుకాలేదు. దీంతో అమె గత రెండేళ్లుగా విధులకు హాజరు కాకపోవడంతో అనుమానాలు వచ్చిన హోం మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టాలని అదేశించింది. ఇక ఇదే క్రమంలో మానవహక్కుల విభాగంలో బోల్డన్ని కేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

ఇన్నాళ్లుగా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసు ప్రధాన కార్యాలయం పలుమార్లు నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ-మెయిల్స్‌కు కూడా స్పందనలేదు. దీంతో అమెకు చెందిన పలు చిరునామాలతో పాటు అమె ఈమొల్ అడ్రస్ లకు కూడా దీంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు నిన్న వివిధ పత్రికల్లో ఆమె కనిపించడం లేదంటూ ప్రకటనలు ఇచ్చారు. ఐపీఎస్ ఆఫీస‌ర్. పైగా ఐజీ ర్యాంకు స్థాయిలో ప‌నిచేస్తున్నారు. కానీ స‌డ‌న్ గా ఆమె క‌నిపించ‌టం లేద‌ని, ఆచూకీ తెల‌పాలంటూ పేప‌ర్ లో ఒక ప్ర‌క‌ట‌న రావడంతో అంతా ఆమెకు ఎమైంది…? ఎవ‌రైనా ఏమైనా చేశారా…? అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles