"Won't Let Government Sit In Peace": Farmer Leader కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వం: బీకేయు రైతు సంఘం నేత

Won t let govt sit in peace till farmers demands are met rakesh tikait

farmers protests, frakesh tikayat, kishan reddy, armers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers farm laws, delhi police, Intelligence bureau, delhi, National, politics

Upping the ante against the government, Bharatiya Kisan Union leader Rakesh Tikait said they won't let it sit in peace till the farmers' demands are met. Addressing a farmers' "mahapanchayat" Tikait said the 40 leaders spearheading the agitation against the Centre's farm laws will tour the entire country to drum up support for the stir.

కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వం: బీకేయు రైతు సంఘం నేత

Posted: 02/15/2021 01:07 PM IST
Won t let govt sit in peace till farmers demands are met rakesh tikait

నూతన సాగు చట్టాల ద్వారా రైతులకు తమ ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ ఏర్పడిందని, ఈ విషయాలను రైతులకు చెప్పకుండా కొందరు వారిని తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎక్కడా ఐకేపీ కేంద్రాలు ఎత్తివేయడం లేదని ఉద్ఘాటించిన ఆయన.. రైతులు సానుకూలంగా ఆలోచించాలన్నారు. అయినా రైతులు మాత్రం దేశ రాజధాని శివార్లలోని సింఘు, టిక్రీలలో గత రెండున్నర నెలలకు పైగా తిష్టవేసి.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్లాల ఉపసంహరణకు పట్టుబడుతున్నారు.

ఈ తరుణంలో తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. సాగు చట్టాలను ఉపసంహరించుకునే వరకు తాము నిరసనోద్యమాన్ని విరమించేది లేదని చెప్పారు. అయితే తామ రైతులు పోలాలను, పంటలను వదిలి నిరసన చేపడుతున్న క్రమంలో అటు ప్రభుత్వాన్ని కూడా ప్రశాంతంగా ఉండనీయ బోమని అన్నారు. హర్యానాలో కర్నల్ లో జరిగిన మహా పంచాయత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం సంయమనం పాటిస్తున్నారని, తన ఉనికికే ప్రమాదం అని తెలిసినా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్ పై వెనక్కు తగ్గని పక్షంలో.. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న 40 మంది రైతు నేతలంతా కలిసి దేశవ్యాప్తంగా పర్యటించి మద్దతు కూడగడతామని చెప్పారు. వ్యవసాయ చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఈ చట్టాలు కేవలం రైతులపైనే కాక చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, ఇతరులపైనా ప్రభావం చూపుతాయని అన్నారు. ‘‘ముందు గోదాములు నిర్మించారు.. తర్వాత చట్టాలు వచ్చాయి. ఇవి బడా కార్పొరేట్లకు మేలు చేసేవని రైతులకు ఆమాత్రం తెలీదనుకుంటున్నారా? ఈ దేశంలో ఆకలిపై వ్యాపారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం’’ అని టికాయత్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles