కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలకు పైగా ఢిల్లీ శివారల్లో అన్నదాతలు నిరసనోద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అందోళనలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. ఏకంగా 1178 మంది ఖాతాదారుల అకౌంట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఇదివరకే రైతుల ఉద్యమంపై దుష్ర్పచారం చేస్తున్న వారి ఖాతాలను గుర్తించిన కేంద్రం వాటిపై చర్యలు తీసుకోవాలని అదేశించింది. ఇక తాజాగా ఆ జాబితాలకు అదనంగా ఈ కొత్త జాజితా చేరింది.
గత నెల 31న రైతుల ఉద్యమాలపై దుష్ప్రచారం చేస్తున్న 257 ట్విట్టర్ ఖాతాల జాబితాను ఆ సంస్థకు పంపిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక తాజాగా మరో 1178 ఖాతాలను కూడా నిలిపివేయాలని అదేశిస్తూ ఆ జాబితాను ట్విట్టర్ కు పంపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ఐటీమంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్విట్టర్ భారత విభాగానికి ఈ మేరకు అదేశాలను జారీ చేసింది. ఈ ఖాతాలన్ని పాకిస్థాన్, ఖలిస్తాన్ కు చెందని యూజర్లవని, అయితే తప్పుడు వార్తలను విరివిగా ప్రచారం చేసేందుకు వీరు సాంకేతికగంగా పలు అటోమేటడ్ బోట్స్ కూడా వినియోగిస్తున్నారని తెలిపింది.
రైతు నిరసనోద్యమంలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్న ఈ ఖాతాలు.. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగోట్టేలా ట్వీట్లు చేస్తున్నాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కోంది. అలా తప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రజల్లో అయోమయ పరిస్థితికి కారణం అవుతున్న ఈ ఖాతాలను తక్షణం నిలిపి వేయాల్సిందగా కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ ను అదేశించింది. అయితే కేంద్రమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అదేశాలపై ఇప్పటికే ఇంకా ట్విట్టర్ స్పందించినట్టుగా లేదు. జనవరి 31న కేంద్రప్రభుత్వం అదేశాలను స్వల్పకాలింగా అమలు చేసిన ట్విట్టర్ ఇప్పడు మాత్రం అసలు స్పందించలేదు.
జనవరి 31న 257 ట్విట్టర్ ఖాతాదారుల అకౌంట్లను నిలిపి వేయాలని భారత ప్రభుత్వం వినతిని మన్నించిన ట్విట్టర్ వాటిని కొన్ని గంటల తరువాత వాటి సర్వీసులను పునరుద్దరించింది. దీంతో కేంద్రప్రభుత్వం ట్విట్టర్ పై తన అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఈ నెల 4న అదేశించిన 1178 ఖాతాలపై ఇప్పటివరకు అసలు స్పందించలేదు. ఇక మరోవైపు ట్విట్టర్ గ్లోబల్ సీఈఓ జాక్ డార్సీ.. రైతుల ఉద్యమాలపై స్పందించిన పలు విదేశీ సెలబ్రిటీల ట్వీట్లను ఆయన స్వయంగా లైక్ చేయడంతో భారత ట్విట్టర్ విభాగం సంధిగ్ధంలో వుంది. ఇక ఈ నేపథ్యంలో ట్విట్టర్ కేంద్రం అదేశాలను అమలుపర్చే విషయంలో పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more