Will be back into power by 2023: Thakur తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాకూర్

Will be back into power by 2023 telangana congress incharge thakur

Manickam Thakur, new incharge, Telangana congress, farmer bills, anti farmer policy, change of government, Telangana, politics

Telangana congress new incharge Manickam Thakur says will be back into power by 2023 in Telangana. According to him every ten years the government in telangana will change.

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాకూర్

Posted: 09/29/2020 12:36 AM IST
Will be back into power by 2023 telangana congress incharge thakur

(Image source from: Twitter.com/manickamtagore)

2023లో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే మా విజన్ అని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ప్రతి పదేళ్ల కు ఓ సారి ప్రభుత్వం మారుతుందని, 2023 ఎన్నికలు కాంగ్రెస్ కి మైలు రాయి లాంటివని అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుతే తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న ఆయన కరెక్ట్ స్టెప్స్ వేసుకుంటూ… అధికారం కోసం అడుగులు వేస్తూ పోతామని అన్నారు. గవర్నర్ అపోయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్న ఆయన తనకు తెలంగాణ కొత్త అని అన్నారు. నాయకుల మధ్య యూనిటీ ఉండాలి అనేది ప్రధాన అంశమన్న ఆయన ఇక్కడి నాయకుల మధ్య యూనిటీ లేదని కాదని అన్నారు.

ప్రాంతీయ పార్టీల మాదిరిగా అభ్యర్థుల ఎంపిక చేయలేమని, రేపు ఢిల్లీకి వెళ్తున్నా… సోనియా..రాహుల్ ని కలిసే ప్రయత్నం చేస్తానని అన్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యం కాదు.. గెలుపు ముఖ్యమని ఆయన అన్నారు. కోదండరామ్ కి మద్దతు పై సబ్ కమిటీ వేస్తామని, ఫ్రెండ్లీ పార్టీతో మేము సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని అన్నారు. పీసీసీ మార్పు పై నేను ఏం మాట్లాడనన్న ఆయన అయినా పీసీసీ మార్పు పార్టీ అంతర్గత అంశమని అన్నారు. పీసీసీ మార్పు అనేది ఏఐసీసీ అధ్యక్షురాలు పరిధిలోని అంశమని అన్నారు.

తెలంగాణ… తమిళనాడు ప్రజలు ఏమోషన్ పీపుల్ అన్న ఆయన ఇక యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు.. ఇక్కడి ఎన్నికలకు పోల్చలేమని, అక్కడి మోడల్ ఇక్కడ వర్కౌట్ కాదని అన్నారు. ఏడాది లో తెలుగు నేర్చుకుంటానన్న ఆయన ప్రస్తుతానికి అయితే వీళ్లంతా నాతో ఇంగ్లీష్ లొనే మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఇవాళ టి- కాంగ్రెస్ గవర్నర్ తమిళ్ సై అపాయింట్మెంట్ కోరింది. దేశ వ్యాప్తంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు పై గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే టి-కాంగ్రెస్ నేతలకు గవర్నర్ సౌందర్ రాజన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

దీంతో రాజ్ భవన్ పక్కన దిల్ కుషా గెస్ట్ హౌస్ లో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజ్ భవన్ ముట్టడించాలని భావించారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు బయలుదేరగా అనుమతి లేదు అంటున్న పోలీస్ లు, గెస్ట్ హౌస్ గెట్ వద్ద భారీగా మోహరించిన వారందరినీ అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఠాగూర్, ఉత్తమ్ లతో పాటు  రేవంత్, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బోసురాజు, దామోదర రాజనర్సిహ్మ, శ్రీనివాస్ కృష్ణన్, దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles