Toddler miraculously survives as train runs over రైలు చక్రాల మధ్య చిక్కుకున్న చిన్నారి..

2 yr old toddler miraculously survives as train runs over him

Kid on rail track, child on rail track, child survive on rail track, rail drive saves child, child Miraculously Survives, Alok Pandey, Anjilee Istwal, Toddler, muraculously survive, loco pilot, emergency brakes, brother, Ballabgarh station, Faridabad, Delhi, Haryana, crime

A two-year-old boy in Haryana, pushed in front of a train allegedly by his older brother, miraculously survived, thanks to the driver's timely action and sheer luck. The child fell onto the tracks after he was allegedly pushed by a teen believed to be his brother. He had been playing near the railway tracks at Ballabgarh station in Faridabad near Delhi.

ITEMVIDEOS: రైలు చక్రాల మధ్య చిక్కుకున్న చిన్నారి.. రక్షించిన లోకోపైలట్లు

Posted: 09/24/2020 10:26 PM IST
2 yr old toddler miraculously survives as train runs over him

అదృష్టం ఉండాలే కానీ.. కొండలను కూడా బద్దలు కొట్టుకుని వచ్చి వరిస్తుందన్నది నానుడి. ఇలానే ఆయష్సు వుండాలే కానీ ఆకలిగొన్న క్రూరమృగాల మధ్యలోంచి కూడా సురక్షితంగా బయటపడవచ్చు. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మనం చదవబోతున్న వార్త. ఈ రెండేళ్ల బడతడకి ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అర్థం చేసుకునే వయస్సు లేకపోయినా.. ఆయుష్పు ఉంది కాబట్టి రెండేళ్ల బుడతడు బతికి బట్టకట్టాడు. అందుకనే చిన్నారులు వున్నప్పుడు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వుండాలని అంటారు. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ల‌లో చాలా అప్రమత్తత అవసరం. వారికి ఏమిటీ ఎలా అన్న విషయం తెలియకుండానే వారు ప్రమాదం అంచుకుజారిపోవచ్చు.

మనం మాట్లాడబోతున్న రెండేళ్ల చిన్నారి సోదరుడితో ఆడుకోవడానికి రైల్వేట్రాకులపైకి వచ్చారు. చిన్నారి త‌ల్లిదండ్రులు తెలిసే వచ్చారో.. లేక తెలియకుండానే ఇక్కడకు చేరుకున్నారో తెలియాదు కానీ.. మృత్యువు ఒడిలోంచి ఓ చిన్నారి తృటిలో తప్పించుకున్నాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన లోకోపైలట్లు చిన్నారిని సురక్షితంగా రైల్వేట్రాకులపై నుంచి బయటకు తీసి పిల్లాడి తల్లికి అప్పగించారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఆవహించినా ఘోరం జరిగేది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ జిల్లా బ‌ల్లాబ్ గ‌ఢ్ రైల్వే స్టేష‌న్ కు సమీపంలో 2 ఏళ్ల చిన్నారి త‌న 14 ఏళ్ల సోద‌రుడితో క‌లిసి ఆడుకుంటున్నాడు.

అయితే వారు ఆ స‌మ‌యంలో రైలు ప‌ట్టాల మీద ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆ చిన్నారిని వ‌దిలిపెట్టి అత‌ని సోద‌రుడు ప‌క్క‌కు వెళ్లాడు. స‌రిగ్గా అదే టైముకు ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే రైలు వ‌చ్చింది. ట్రైన్ కింద చ‌క్రాల మ‌ధ్య‌లో ఆ చిన్నారి ఇరుక్కున్నాడు. దాన్ని గ‌మ‌నించిన లోకో పైల‌ట్ దీవాన్ సింగ్‌, అత‌ని అసిస్టెంట్ అతుల్ ఆనంద్‌లు వెంట‌నే ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు. అనంత‌రం రైలు చక్రాల మ‌ధ్య చిక్కుకున్న ఆ బాలున్ని వారు ర‌క్షించారు. అప్ప‌టికే బాగా ఏడుస్తున్న ఆ బాలున్ని స‌ముదాయించి నెమ్మ‌దిగా అత‌న్ని చ‌క్రాల నుంచి బ‌య‌ట‌కు తీశారు. కాగా ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేద‌ని వారు తెలిపారు. ఈ మేర‌కు రైల్వే అధికారులు ఆ బాలురు ఇద్దరినీ వారి త‌ల్లికి అప్ప‌గించారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

(Video Source:  Grupo de medios)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles