Railways MoS Suresh Angadi dies of Covid-19 కరోనా బారిన పడి కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూత

Union minister suresh angadi dies of covid pm deve gowda express grief

Union Minister, Suresh Angadi, Covid-19, PM Narendra Modi, Janata Dal (s) President, HD Deva Gowda, Condolence, H Vasanth kumar, Ashok Gasti, Balli Durga Prasad Rao. Coronavirus, karanataka, India, National Politics

Junior Railways Minister Suresh Angadi has died nearly two weeks after he tested positive for coronavirus infection. He was admitted to AIIMS in Delhi after his condition worsened. He was the first Union Minister and the fourth MP to die due to COVID-19 infection.

కరోనా బారిన పడి కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూత

Posted: 09/24/2020 04:31 AM IST
Union minister suresh angadi dies of covid pm deve gowda express grief

కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగాడి ఇవాళ కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గత రెండు వారాలుగా అసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి పరిస్థితి విషమించడంతో మరణించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ ఆంగడి ఆరోగ్య పరిస్థితి ఇవాళ రాత్రి పూర్తీగా క్షీణించింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కర్ణాటకలోని బెలగావి నుంచి ఆయన వరుసగా నాల్గవసారి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీని బలపేతం చేయడంతో పాటు ఆయన కృష్టి, పట్టుదలకు ఆయనకు కేంద్రమంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చింది.

సురేష్ అంగాడి కర్ణాటకలోని బెలగావి నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు ముందు కన్నడ నాట ప్రముఖ న్యాయవాదిగా సేవలు అందించారు. ఆ తరువాత బీజేపి పార్టీ పట్ల ఆకర్షితులై ఆయన ఆ పార్టీలో చేరి నాలుగు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. 1955లో జన్మించిన ఆయన 65 ఏళ్ల వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆయన అనుయాయువలను, పార్టీ కార్యకర్తలను శోకసంధ్రంలో ముంచింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బెలగావిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి, ఆయన నియోజకవర్గంలో సంతాపసూచకంగా స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి స్తానికులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

కరోనా మహమ్మారిని తేలికపాటి వ్యాధి అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నా కేంద్రం కానీ, సోషల్ మీడియా నిర్వాహకులు కానీ వాటని పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ ఓ భయంకరమైన రోగమని ఇప్పటికే నలుగురు పదవిలో వున్న పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు కూడా దీని బారిన పడి మరణించారన్న విషయాలను కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ ప్రజల దృష్టికి తీసుకురావడం లేదు. ఇక దీనికి తోడు మాజీ ప్రజాప్రతినిధులు కూడా పలువురు ఈ వ్యాధిబారిన పడి అసువులు బాసారు. ఈ వ్యాధి బారి నుంచి తమను తాము రక్షించుకోవాలన్న సందేభాలను కూడా ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వడం లేదు. పరిస్థితులు నానాటికీ దారుణంగా తయారవుతున్న క్రమంలో ప్రభుత్వాలు మాత్రం ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కాగా రైల్వే శాఖ సహాయమంత్రి ఆంగడి అకాల మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంగడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నివాళులర్పించారు. 'సురేష్ ఆంగడి అంకితభావంతో ఉన్న ఎంపీ, సమర్థ మంత్రి. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అతని మరణం విచారకరం. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) చీఫ్ హెచ్.డి దేవేగౌడ.. సురేష్ అంగాడి మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ, "కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి మరణంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అతను తనకు ఒక తమ్ముడిలా ఉండేవాడు. నేను అతనిని కోల్పోయాను.. ఇది మన దేశానికి భరించలేని నష్టం" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles