Michelob Ultra hiring 'chief exploration officer' బీర్ తాగుతూ పార్కులలో పర్యటిస్తే.. రూ.36 లక్షల మీ సొంతం..

Michelob ultra looking to pay chief exploration officer 50k to visit national parks

Michelob Ultra, beer company, twitter, Chief Exploration officer, 50 dollars, friend, pet dog, National parks, camper van, United States, America

Beer maker Anheuser-Busch is looking to hire a new CEO for their Michelob Ultra Pure Gold brand, CEO here company means chief exploration officer. According to the brand, the new 'CEO' will be paid $50,000 to explore America's national parks.

పార్కుల చుట్టూ బీర్ తాగుతూ పర్యటిస్తే.. రూ.36 లక్షల మీ సొంతం..

Posted: 09/24/2020 03:53 AM IST
Michelob ultra looking to pay chief exploration officer 50k to visit national parks

(Image source from: Twitter.com/MichelobULTRA)

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ నివాసాలకే పరిమితం అయ్యారు. ఇక అంతకుముందులా ప్రజలను సరదాగా బయలకు విందులకు, వినోదాలకు వెళ్లేలా చేయాలన్న ప్రయత్నంతో పాటు విహారయాత్రలకు వెళ్లేలా చేసేందుకు ఓ సంస్థ సంకల్పించింది. అంతమాత్రాన తన ప్రాణాల మీదకు తెచ్చుకునేందుకు ఎవరు మాత్రం సాహసిస్తారు. అయినా విహార యాత్రలకు తిరగాలంటే ముందు చేతి నిండా డబ్బు వుండాలి. ఇక దానికి తోడు వెంట స్నేహితులో, లేక భార్య, లేక మరెవరో వుంటేనాగా సరద. అయినా కరోనా నేపథ్యంలో చేతుల్లోకి వస్తున్న జీతం డబ్బు అంతంతమాత్రంగానే వున్న ఈ సమయంలో వున్న డబ్బును ఖర్చుచేసుకుని ఎవరు మాత్రం విహారయాత్రలు చేయాలనుకుంటారు.

సంస్థలు సంకల్పించడంతో పాటు కొద్దే గోప్పో డబ్బును కూడా సమకూర్చినా వెళ్లడానికి ఎవరూ రెడీగా వుండరు. అయితే రవాణాతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసేలా బీర్ ను కూడా ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇలా చేసినందుకు గానే ఏకంగా 36 లక్షల రూపాయలను మీకు జీతంగా ఇస్తేనూ.. అదీనూ ఉరికే కాదు తమ సంస్థ ప్రధాన విహర అధికారి హోదాను కల్పిస్తే.. నేను నేను అంటూ పోటీ పడే వారి సంఖ్య పెరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానమే లేదు. ఇంతకీ ఇలాంటి ఆఫర్ ను ఎవరు కల్పిస్తారు. బీర్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఇలా పార్కుల చుట్టూ తిరగడమే ఉద్యోగంగా.. అరు నెలల పాటు ఇలా చేస్తే ఏకంగా రూ.36 లక్షలను ఎవరిస్తారంటారు.? అని అనుమానం అవసరం లేదు.

అమెరికాకు చెందిన బీర్‌ తయారీ సంస్థ మైకెలాబ్‌ అల్ట్రా తమ సంస్థలో ‘చీఫ్ ఎక్స్ ప్లోరేషన్ ఆఫీసర్’ ఉద్యోగాన్ని సృష్టించి అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. తమ సంస్థ బీర్ తాగుతూ.. అమెరికాలోని పార్కులన్నింటినీ పర్యటిస్తే నెలకు 50వేల డాలర్లు(దాదాపు రూ. 36లక్షలు)జీతం ఇస్తానంటోంది. అయితే ఈ జాబ్ ఉండేది ఆరు నెలలు మాత్రమే. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ వారు కాంపర్ వ్యాన్ లో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కుల్లో పర్యటించాలని మైకెలాబ్ అల్ట్రా సంస్థ వెల్లడించింది. ఆ వ్యానులో బాత్రూమ్, ఫ్రిడ్జ్ అందులో సంస్థ తయారు చేసిన బీర్లు ఉంటాయి. వీటిని తాగుతూ.. జాతీయ పార్కుల్లో విహరిస్తూ ఆకట్టుకునే ఫొటోలు తీసి సంస్థకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడమే సీఈఓ ఉద్యోగం. అమెరికాలో 400కుపైగా జాతీయ పార్కులు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles