Filmmaker Nishikant Kamat Dies At 50 బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత

Gone too soon tributes to nishikant kamat from bollywood stars

nishikant kamat died, nishikant kamat, marathi actor no more, marathi director passes away, bollywood director no more, bollywood director passes away, nishikant kamat no more, nishikant kamat passes away, ritesh deshmukh, ajay devgn, john abraham, AIG Hospitals

Filmmaker Nishikant Kamat has died in a Hyderabad hospital. Mr Kamat, 50, was believed to have been suffering from chronic liver disease. 'I will miss you my friend Nishikant Kamat. Rest in peace,' tweeted actor Riteish Deshmukh, who starred in Mr Kamat's film Lai Bhaari.

బాలీవుడ్ లో విషాదం.. దర్శకుడు నిషికాంత్ కామత్ కన్నుమూత

Posted: 08/18/2020 02:18 AM IST
Gone too soon tributes to nishikant kamat from bollywood stars

బాలీవుడ్‌ లో మరో విషాదం అలుముకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు నిషికాంత్‌ కామత్‌ (50) కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు, తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ గత నెల 31న ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకున్నట్లు కనిపించినా ఇవాళ మధ్యాహ్నం ఆకస్మాత్తుగా ఆయన అరోగ్యం విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆయన కన్నుమూసినట్లు వైద్య నిపుణులు తెలిపారు.

ఆయన గత రెండేళ్లుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన తన అనారోగ్యం సమస్యకు చికిత్సను పోందుతూనే వున్నారు. అయితే ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పూర్తిగా తిరగబడటంతో ఆయన జులై 31న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పోందుతూ కొద్దిగా కొలుకున్నారని, త్వరలోనూ పూర్తిగా రికవర్ అయ్యి వస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన అరోగ్యం ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా విషమించింది. వైద్యులు ఆయనకు చికిత్స చేసినా.. ఆయన శరీరంలోని పలు ఆవయవాలు సహకరించకపోవడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. నిషికాంత్ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, ‘మదారి’, ‘ముంబయి మేరీ జాన్‌’ తదితర చిత్రాలు జనాధరణ పోందాయి, నిషికాంత్‌ కామత్‌ పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. 2005లో ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘డాంబివాలీ’ మరాఠీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

నిషికాంత్‌ మరణ వార్తలను తొలుత ఆయన స్నేహితుడు, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. నిషికాంత్ చనిపోలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నిషికాంత్‌ కన్నుమూయడంతో రితేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోతున్నా. నిషికాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు. నిషికాంత్‌ మృతిపై బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. ‘‘కేవలం ‘దృశ్యం’ చిత్రంతోనే మా ఇద్దరి స్నేహాన్ని సరిచూడలేను. ఆయన నన్ను, టబును కలిపి అద్భుతంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తెలివైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతుంటారు. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నిషికాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని అజయ్‌ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles