Chinese are panicking about banks bailout చైనా అర్థిక సంక్షోభం: నగదు విత్ డ్రాపై అంక్షలు

Chinese are panicking about their banks collapsing after rumours

China, China Renminbi Spot, Banking, Bank Deposits, Debt, Bonds, Coronavirus, CHINA INTERNATIONAL CAPITA-H, Shenzhen, Retail, business, markets

Social media-fueled rumors about banks collapsing are popping up at an unprecedented frequency in China, forcing regulators and even the police to step in to calm depositors.

పరిపుష్టి నుంచి పతనానికి చైనా అర్థిక వ్యవస్థ: నగదు విత్ డ్రాపై అంక్షలు

Posted: 07/18/2020 11:16 PM IST
Chinese are panicking about their banks collapsing after rumours

కరోనా మహమ్మారి చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా బ్యాంకులపై ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపంలో కనిపిస్తోంది. దీంతో చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇప్పటికే పెద్ద లావాదేవీల కోసం బ్యాంకులపై అనేక కఠినమైన నియమాలను విధించింది. ఈ నిబంధనలలో వివాదాస్పదమైన బ్యాంకు నుండి పెద్ద మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే, ప్రజలు ముందుగా బ్యాంకుకు తెలియజేయాలి. ఆ తరువాతే బ్యాంకు అనుమతితో మాత్రమే ఈ మొత్తాన్ని వారు డబ్బును విత్ డ్రా చేసుకునే వీలుంది. ఈ దెబ్బతో ప్రజలు చైనీస్ బ్యాంకులు దివాళా తీశాయా అనే అనుమానంతో భయపడుతున్నారు. దీంతో ప్రజలు బ్యాంకుల ముందు భారీ లైన్లలో నిలబడి డబ్బును విత్ డ్రా చేసుకుంటున్నారు.

తమ దేశీయ బ్యాంకులను విశ్వసించని చైనా ప్రజలు

 

చైనాలోని బ్యాంకుల్లో డబ్బును ఉపసంహరించుకునే కొత్త నిబంధనలు, అలాగే కరోనా మహమ్మారి కారణంగా మళ్లీ లాక్ డౌన్ పెట్టే అవకాశం ఉందనే భయం జనాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ వద్ద డబ్బు ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో, బ్యాంకు నుండి ఎక్కువ డబ్బును ఉపసంహరించుకోవడంపై ఏదైనా నియంత్రణ విధిస్తారనే భయం కూడా జనాల్లో ఉంది. అయితే ముందు ముందు తక్కువ డబ్బును ఉపసంహరించుకోవడంపై కూడా ఈ నియంత్రణ విధించవచ్చు అనే భయం కూడా జనాలను బ్యాంకుల ముందు నిలబెట్టేందుకు దోహదపడింది.

బ్యాంకుల ముందు భారీ క్యూ కట్టిన జనం

 

చైనాలో బ్యాంకులు, అలాగే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా దెబ్బతో అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు బ్యాంకులపై నమ్మకం కోల్పోయారు. అటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీలు అప్పులు తీర్చలేక మునిగిపోతారనే భయం చైనా సెంట్రల్ బ్యాంకులో నెలకొని ఉంది. దీంతో బ్యాంకుల్లో లిక్విడిటీ ప్రాబ్లం రాకుండా, పెద్ద మొత్తాన్ని ఉపసంహరించుకోవడంపై ఆంక్షలు విధించారు. అటు చైనా మీడియా నివేదిక ప్రకారం, చైనాలోని బ్యాంకులపై భారీగా అప్పుల భారం ఉంది. ఆ అప్పులను పెద్ద కంపెనీల నుంచి వసూలు చేయడం కష్టంగా మారింది. దీంతో బ్యాంకులు దివాళా తీస్తే తమ డబ్బు పోతుందని వినియోగదారులు భావించడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుండి డబ్బును ఉపసంహరణకు బ్యాంకుల కుంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హుబీ ప్రావిన్స్‌లో మొదటిసారి పైలట్ ప్రాజెక్టుగా ముందస్తు అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకునే పరిమితులను ప్రవేశపెట్టింది. ఇది ఇతర ప్రాంతాలలో కూడా అమలు చేయవచ్చనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో తమ డబ్బు ఏమై పోతుందో అనే భయంతో జనం పెద్ద మొత్తంలో డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

నగదు ఉపసంహరణపై అంక్షలు...

 

ప్రస్తుతం ఒక కస్టమర్ 1,00,000 యువాన్ల కంటే ఎక్కువ డబ్బును (భారతీయ కరెన్సీలో సుమారు 10 లక్షల రూపాయలు) లేదా ఒక వ్యాపారవేత్త 5,00,000 యువాన్లకు పైగా బ్యాంకు నుండి డబ్బును ఉపసంహరించుకోవాలంటే ముందుగా, బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. అటు వైపు అనేక స్థానిక బ్యాంకులు వినియోగదారులకు కావాల్సిన డబ్బును చెల్లించలేకపోతున్నాయిన. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు తమ డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, బ్యాంకుల్లో లావాదేవీలను తగ్గించడానికి 2 సంవత్సరాల పైలట్ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్‌లో జెజియాంగ్, షెన్‌జెన్ ప్రావిన్సులకు విస్తరించే అవకాశం ఉంది. దీంతో ఈ మూడు ప్రావిన్సులలో సుమారు 7 కోట్ల మంది ఇక్కడ నివసిస్తున్నారు. నగదు ఉపసంహరించుకునేందుకు ఖాతాదారుల రద్దీ అధిక సంఖ్యలో బ్యాంకులకు చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  China Renminbi Spot  Banking  Bank Deposits  Coronavirus  Shenzhen  Retail  business  markets  

Other Articles