Maharashtra and Delhi will get corona virus medicine తెలంగాణతో పాటు ఆ ఐదు రాష్ట్రాలకు హెటిరో మందు

Maharashtra delhi among 5 states to receive first batch of covid 19 drug

Hyderabad Pharma company, Hetero, COVID-19, coronavirus, Remdesivir, Hetero Group of Companies, Covifor, covifor injection, Maharashtra, Delhi, Telangana, Gujarat, Tamil Nadu

Hyderabad-based drugmaker Hetero, which has approval to manufacture and market the generic version of the experimental COVID-19 drug Remdesivir, has sent 20,000 vials to five states including Maharashtra and Delhi - the two worst affected states in the country.

తెలంగాణతో పాటు ఆ ఐదు రాష్ట్రాలకు హెటిరో మందు

Posted: 06/25/2020 11:30 PM IST
Maharashtra delhi among 5 states to receive first batch of covid 19 drug

తెలంగాణకు చెందిన మందుల తయారీ సంస్థ హెటెరో ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ 19 డ్రగ్ ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్‌కు కూడా రానుంది. ఫస్ట్ బ్యాచ్‌ డ్రగ్‌ను ఐదు రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను కూడా చేర్చింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హెటెరో సంస్థ కోవిడ్ 19 నివారణలో భాగంగా తాజాగా రెమ్‌దేశీవైర్‌ పేరుతో ఓ మందును తయారీ, మార్కెటింగ్ కూడా చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. తొలి దశలో 20,000 డోస్‌లను తయారు చేస్తారు. ఆ ఫస్ట్ బ్యాచ్‌ మందులను దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులతో బాధపడుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు అందించనున్నారు. కోవిఫర్ పేరుతో ఈ మందును మార్కెట్లోకి తీసుకొస్తోంది హెటెరో. ఈ డ్రగ్ 100 మిల్లీగ్రాముల విలువ రూ.5400 ఉంటుంది. నాలుగు వారాల్లో లక్ష డోస్‌లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

రెండో బ్యాచ్‌లో తయారయ్యే డ్రగ్‌ను కోల్‌కతా, భోపాల్, ఇండోర్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కోచి, త్రివేండ్రం, గోవాలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ కోవిఫర్ డ్రగ్ హైదరాబాద్‌లోని హెటెరో ప్లాంట్‌లో తయారవుతోంది. దీన్ని విశాఖలో కూడా తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డ్రగ్‌ను కేవలం ఆస్పత్రులు, ప్రభుత్వానికి అందనున్నాయి. రిటైల్‌లో ప్రస్తుతానికి అందుబాటులోకి రావని హెటెరో గ్రూప్ కంపెనీస్ ఎండీ బండి వంశీ కృష్ణ తెలిపారు. వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. భారత్ లో గడచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 418 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా 4,73, 105కు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 14,894 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ఇప్పటి వరకూ కరోనా నుంచి 2,76 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో 1,86,517 యాక్టివ్ కేసలు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం  గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10444కు చేరింది. కరోనా నుంచి ఒక్కరోజులో 137 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4361 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా కొత్తగా ఐదుగురు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 225కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5858గా ఉంది. ఇక తెలంగాణలో ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 67318గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hetero  COVID-19  coronavirus  Remdesivir  Hetero Group of Companies  Telangana  Maharashtra  Delhi  

Other Articles