Gujarat #1 State In Fake Currency Note Circulation! నకిలీ నోట్లలో రూ.2000లదే సింహభాగం.. గుజరాత్ దే అగ్రస్థానం.!

56 of all fake currency notes are rs 2000 gujarat 1 state in fake currency note circulation

monetisation, demonetisation of Rs. 2000 notes, demonetization, Demonetized Currency, fake currency, fake note, security features, Remonetisation, indian Economy, PM Modi, Narendra Modi, National Crime Records Bureau (NCRB), Gujarat, Crime

As per the latest reports of the National Crime Records Bureau (NCRB), in terms of value, Rs 2,000 banknotes comprised 56 percent of all fake currency seized in India after demonetization.

నకిలీ నోట్లలో రూ.2000లదే సింహభాగం.. గుజరాత్ దే అగ్రస్థానం.!

Posted: 01/17/2020 01:22 PM IST
56 of all fake currency notes are rs 2000 gujarat 1 state in fake currency note circulation

దేశంలో నకిలీ నోట్ల అటను కట్టిస్తూ.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. దేశ ప్రజలపై పెనుభారం మోపిన ఈ నిర్ణయంతో.. కష్టాలు బోనస్ గా లభించిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తసీుకుని మూడేళ్లు గడిచిపోయినా ఇంకా ఇప్పటికీ నోట్ల రద్దు తాలుకు ప్రభావం మాత్రం విడిచిపోలేదు. అయితే ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీలు, కేంద్ర మంత్రులు, ఆర్బీఐ, దేశ ఆర్థికశాఖకు చెందిన ప్రముఖులు ఈ నోట్ల రద్దు క్రమంలో చెప్పిన విషయాలు, ఆశించిన ఫలితాలు అందుకున్నారా.? అంటే అదీ లేదనే తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దేశ ఆర్థిక విధానంపై పెను ప్రభావం చూపుతున్న పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా చలామణిలో వున్న నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడంతో పాటు అవినీతి, అక్రమార్కుల ఆటను కూడా కట్టించవచ్చునన్నారు. దీంతో పాటు ఉగ్రవాద కార్యాకలాపాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్యా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఒర్చిన ప్రజలు విమర్శల జడివాన మధ్యలో స్వాగతించక తప్పలేదు. ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని మరీ క్యూలైన్లలో నిల్చుని కరెన్సీ నోట్లను మార్చుకున్నారు.

ఇన్ని కష్టాలు పడినా దేశ ఆర్థిక పరిస్థితి గాడిన పడలేదు సరికదా.. మరింతగా గాడితప్పినట్లు అర్థిక వేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరో దిగ్బ్రాంతికర విషయం ఏమిటంటే.. దేశంలో చలామణిలో ఉన్న రెండు వేల నోట్లలో 56 శాతం నకిలీలని తేలింది. అదునాతన భద్రతా ఫీచర్లతో కూడిని కరెన్సీ నోట్లను తాము ప్రవేశపెట్టామని ప్రకటించిన కేంద్రానికి దిమ్మదిరిగేలా నివేదిక వెలువడింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అందించిన డేటా ప్రకారం నోట్ల రద్దు అనంతరం మార్కెట్లోకి విడుదలైన నోట్లలో అత్యధికంగా నకిలీలు తయారవుతున్నవి రెండు వేల నోట్లేనని ఈ నివేదిక తేల్చింది.

నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తొలిసారి అప్పటిలో పెద్దనోట్లుగా చలామణిలో వున్న రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో రూ.2000 నోటును తీసుకువచ్చారు. దీంతో పాటు ఐదు వందల రూపాయల కొత్త నోటును కూడా చలామణిలోకి తీసుకువచ్చారు. కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటుకు అధునాతన భద్రతా ఫీచలర్లు వున్నాయిని.. వీటికి నకిలీలను చేయడం అసాథ్యమని కూడా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న నకిలీలలో రూ.2 వేల నోట్లే అధికమని తేలింది. అంతేకాదు గుజారాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.2 వేల రూపాయల కరెన్సీకి చెందిన నకిలీ నోట్లు చలామణిలో వున్నాయని తేలింది.  మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. అసలు స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles