Rahul Gandhi targets PM on Indian Economy ‘‘నేను రాహుల్ గాంధీ.. రాహుల్ సావర్కర్ కాదు..’’

My name is rahul gandhi not rahul savarkar cong rally challenges govt

Rahul gandhi, Sonia Gandhi, Priyanka gandhi, Citizenship Bill, Congress Bharat bachao rally, Indian Economy, Enemies, Demonitisation, CAB, Rape In India, Apology, Waive-off Debts, BPCL, Adani, Reliance, Politics

"My name is Rahul Gandhi, not Rahul Savarkar. I will never apologise for speaking truth and nor will any Congressman do so," said the Congress Leader at the party's 'Bharat Bachao' rally in Delhi. He accused PM of "destroying" the economy and said, "It is PM himself and not India's enemies who have destroyed our economy."

‘‘నేను రాహుల్ గాంధీ.. రాహుల్ సావర్కర్ కాదు..’’

Posted: 12/14/2019 04:39 PM IST
My name is rahul gandhi not rahul savarkar cong rally challenges govt

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. 2016 నవంబర్ 8న రాత్రి ఎనమిది గంటలకు ఆయన తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. దేశ ఆర్థిక వ్యవస్థను గతితప్పేలా చేసిందని.. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ గాయలు తగ్గడం లేదని.. మరింతగా వెన్నాడుతున్నాయిన దుయ్యబట్టారు. దేశంలో ఆర్థికవ్యవస్థ అత్యంత పతనావస్థలో చేరుకుందని.. ప్రపంచమంతా భారత్ ఆర్థికస్థితి నేపథ్యంలో ఏం జరుగుతోందని ఆరా తీస్తోందంటూ వ్యాఖ్యానించారు.  

‘భారత్‌ బచావో’ పేరిట శనివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్టాడుతూ.. సామాన్యుల జేబుల్లో నుంచి బలవంతంగా డబ్బులు లాగేసుకుంటున్న ప్రభుత్వం.. లక్షల కోట్ల రూపాయలు ఆదానీ సహా ఇతర పారిశ్రామికవేత్తల చేతుల్లో పోస్తోందని ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క ఆదానీకే కేంద్రం లక్షల కోట్ల విలువ చేసే 50 కాంట్రాక్టులు అప్పగించిందన్నారు. ధేశంలోని తమకు అనుకూలురైన 20 మంది పారిశ్రామికవేత్తలకు రూ.1.40లక్షల కోట్లను మాఫీ చేసిందని.. కానీ రైతులకు మాత్రం రుణమాఫీ అందనిద్రాక్షగానే మార్చేసిందన్నారు.

పెద్దనోట్ల రద్దు సమయంలో ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సూచించినా మోదీ పట్టించుకోలేదన్నారు. ఫలితంగా ఇప్పటికీ సామాన్యల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న ధర్మాలకు నెలవైన దేశంలో బీజేపి విభజన రాజకీయాలను చేస్తూ.. ఎక్కడికక్కడ చిచ్చుపెడుతోందని అన్నారు. దేశంలో అరాచక పాలనను సాగిస్తోందని ఆయన దుయ్యబట్టారు.  బీజేపీ విధానాలతో అసోం నుంచి కశ్మీర్ వరకు అంతా తగలబడిపోతోందన్నారు.

బీజేపీ ఆర్థిక విధానాలు, పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్), రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన 'భారత్ బచావో' సభలో రాహుల్ ఒకింత ఆవేశంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ తాను రాహుల్ గాంధీని అని, రాహుల్ సావర్కర్ ను కాదని వ్యంగంగా వ్యాఖ్యాలు చేశారు. అత్యాచారాల భారతం అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చేప్పేది లేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో స్వయంగా ప్రధానమంత్రి పాత్రినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉన్నావ్ బాధితురాలి అత్యాచార కేసులో బీజేపి ఎమ్మెల్యే హత్యచార అరోపణలు ఎదుర్కోన్నాడని అన్నారు.

తెలంగాణలో దిశ, తమిళనాడులో మరో దిశ.. ఇక ఉత్తరాన రోజుకెన్నో అత్యాచార వార్తలను చూడాల్సివస్తుందని, దీనిపై మాత్రం ప్రధాని నరేంద్రమోడీ.. ఒక్క మాట కూడా మాట్లాడరని.. నోరు విప్పరని.. మౌనంగా వుండటమే ఈ సమస్యకు పరిష్కారమా.? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు నిలదీసిన వ్యక్తి.. అధికారంలోకి వచ్చి అరేళ్లు గడుస్తున్నా ఏం చేశారని రాహుల్ ప్రశ్నించారు. రైతులు అభివృద్ది చెందకుండా, ఉద్యోగులు అభివృద్ది చెందకుండా, నిరుద్యోగాన్ని ప్రారదోలకుండా దేశం ముందుకు వెళ్లలేదని రాహుల్ అన్నారు.

భారత్‌ను ఎవరో శత్రువులు నాశనం చేయలేదని.. స్వయంగా ప్రధాని ఫీటంపై కూర్చున్న నరేంద్ర మోదీనే దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఎవరీ వద్ద డబ్బు లేకుండా చేసి.. వారి కొనుగోలు శక్తిని దెబ్బతీసి ఆర్థిక మందగమనానికి కారణమయ్యాడని ఆరోపించారు. దేశంలో ఉన్న మీడియాను కూడా కొనేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. మోదీ మీడియాను కొనగలరేమో గానీ దేశంలోని పౌరులను కొనలేరని అన్నారు. దేశంలోని ప్రతీ వ్యవస్థలో పనిచేసే పౌరులందరికీ దేశంపై బాధ్యత ఉందని రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Congress Bharat bachao rally  Indian Economy  Enemies  Demonitisation  CAB  BPCL  Adani  Reliance  Politics  

Other Articles