methanol blending in petrol soon మిథనాల్ పెట్రోల్ ధర.. లీటరుకు రూ.22 మాత్రమే

Government to soon unveil policy on methanol blending in petrol

Nitin Gadkari, methanol petrol, china, RCF, Defence Ministry, NHIDCL, india, National Highways, Borders Roads Organisation, Union Roads Minister

Union Roads Minister Nitin Gadkari said the government will be soon announcing a policy which calls for 15 per cent blending of methanol in petrol to make it cheaper and also reduce pollution.

మిథనాల్ పెట్రోల్ ధర.. లీటరుకు రూ.22 మాత్రమే

Posted: 12/28/2017 05:20 PM IST
Government to soon unveil policy on methanol blending in petrol

వాహనదారులకు శుభవార్త అందనుంది. అదేంటి అంటే ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో వాటిని కిందకు తీసుకురావడం ప్రభుత్వాల చేతిలో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అనేషిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. త్వరలోనే పెట్రోల్ తక్కువ ధరకే లభించనుంది. అదికూడా ఎంత ధరకంటే.. ఏకంగా ప్రస్తుతం వున్న ధరలో పావు శాతానికే లీటర్ పెట్రోల్ అందించనుంది. ఏంటీ ఇది సాథ్యమేనా..? అని అలోచనలో పడ్డారా.?

సాధ్యమనే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం మిథనాల్‌ పాలసీని కూడా ప్రకటించింది. ఈ పాలసీతో పెట్రోల్ లో 15 శాతం బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని కలుపనున్నారు. దీంతో పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయని, కాలుష్యం తగ్గుతుందని కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 80తో పోలిస్తే, బొగ్గు నుంచి ఉత్పత్తికి అయ్యే మిథనాల్ ఖర్చు కేవలం రూ.22 మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే చైనా దీన్ని రూ.17కే ఉత్పత్తి చేస్తుందని తెలిపిన గడ్కారీ.. ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు.

మిథనాల్ గురించి..

మిథనాల్ పెట్రోల్ వాడటం వల్ల మైలేజీతో పాటు ఇంజిన్ సౌండ్ ఎక్కువ రాదు.
వాహన కాలుష్య స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
దీపకం ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా అనేక కర్మాగారాలు మిథనాల్ ను ఉత్పత్తి చేయగలవు.
స్వీడన్ ఆటో మేజర్ వోల్వో మిథనాల్ తో నడిచే స్పెషల్ ఇంజీన్ ను రూపొందించింది.
స్థానికంగా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నారు.
త్వరలోనే ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రణాళిక చేస్తోంది కేంద్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles