bride disappears with jewellery two days after wedding పెళైన రెండో రోజే.. అభరణాలతో నవవధువు జంప్..

Bride disappears with jewellery two days after wedding

con wite in uttarakhand, con wife in roorkee, wife dupes husband in roorkee, wife dupes husband in uttarakhand, new couple, police, dehradun, husband duped, con wife, roorkee, uttarakhand, Crime

one woman imitated the character played by Sonam Kapoor from the Bollywood film Dolly ki Doli to allegedly con her husband and steal the family’s gold jewellery

పెళైన రెండో రోజే.. అభరణాలతో నవవధువు జంప్..

Posted: 11/25/2017 03:56 PM IST
Bride disappears with jewellery two days after wedding

పెళ్లంటే జన్మజన్మల బంధమని భావించే పవిత్ర హైందవ సంప్రదాయంలో..ఓ నవవధువు మాత్రం సినిమా ఫక్కీలో భర్తను, ఆయన తరపు బంధువులను మోసం చేసిన పెళ్లికి పెట్టిన నగలు, బంగారు అభరణాలతో ఉడాయించింది. వివాహం జరిగిన రెండురోజులకే తమను మోసం చేయడంతో షాక్ నుంచి తేరుకున్న భర్త.. పోలీసులను అశ్రయించి అమెపై పిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది.

బాలీవుడ్ లో సోనం కపూర్‌ హీరోయిన్ గా వచ్చిన ‘డాలీకి డోలి’ సినిమా తరహాలోనే ఓ యువతి తన భర్తను మోసం చేసి.. అతిని కళ్లుగప్పి ఉడాయించింది ఘటన తాలుకు వివరాల్లోకి వెళ్తే.. రూర్కీ జిల్లా కువాన్ హెది గ్రామానికి చెందిన అజయ్ త్యాగి కుటుంబానికి ఇటీవల ఓ యువతి పరిచయమైంది. తన కాయ  అని పరిచయం చేసుకున్న యువతి.. ఆ కుటుంబంత సన్నిహిత్యం పెంచుకుంది. కాయను.. అజయ్ కు తగిన జోడీ అని భావించిన కుటుంబసభ్యులు ఈ నెల 22న వారి పెళ్లి చేశారు.

రెండు రోజులు అంతా సజావుగానే సాగింది. అ తరువాత నూతన వధువు ఉన్నట్టుండి తనకు అస్వస్థతగా ఉందని తెలిపింది. దీంతో అజయ్ ఆమెను అసుప్రతికి తీసుకెళ్లాడు. డాక్టర్‌ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. ఆ తర్వాత తనకు చికెన్‌ తినాలని ఉందని వధువు అజయ్ కు చెప్పింది. సమీపంలో మాంసాహార వంటకాలు అందుబాటులో లేకపోవడంతో పుర్కాజీ పట్టణానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్ లోకి వెళ్లి చికెన్‌ తిన్న తర్వాత కూల్‌ డ్రింక్‌ కోరడంతో దానిని తీసుకొచ్చేందుకు అజయ్‌ వెళ్లాడు. కూల్ డ్రింక్ తీసుకోచ్చిన అజయ్ అప్పటి వరకు అక్కడే వున్న కాయ కనిపించకపోవడంతో అందోళన చెందాడు.

చుట్టుపక్కలతో పాటు మళ్లీ డాక్టరు వద్దకు కూడా వెళ్లి విచారించాడు. ఎక్కడ కనిపించకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వాళ్లూ కూడా వచ్చి వెతకసాగారు. అయితే అనుమానం వచ్చిన త్యాగి ఇంటి మహిళలు కాయకు తాము పెట్టిన బహుమానాలను చూడగా అవి కూడా కనబడలేదు. మోసం చేసి నగలతో వధువు ఉడాయించిందని గుర్తించిన అజయ్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాయను తమకు పరిచయం చేసిన మరో మాయలేడీ కూడా కనిపించడం లేదని పోలీసులకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new couple  police  dehradun  husband duped  con wife  roorkee  uttarakhand  Crime  

Other Articles