capital Delhi turns gas chamber primary schools to be shut | వామ్మో ఢిల్లీ... అడుగుబయటపెడితే అంతే!

New delhi pollution hits dangerous level

Delhi, Delhi Pollution, Delhi Emergency, Delhi Air Pollution, Delhi Schools Shut Down, Aravind Kejriwal, Delhi Pollution Level

Delhi air too risky for schools to stay open. Severe air pollution declared public health emergency in Delhi. As Delhi gasps, primary schools to be shut, capital Delhi turns gas chamber primary schools to be shut.

ఢిల్లీ కాలుష్యం ఏ రేంజ్ కి చేరిందంటే...

Posted: 11/08/2017 09:31 AM IST
New delhi pollution hits dangerous level

దేశ రాజధాని ఇప్పుడు గ్యాస్ ఛాంబర్ లా మారి వాయుకాలుష్యం కొట్టుమిట్టాడుతోంది. స్వచ్ఛమైన గాలి శాతం తగ్గిపోవటంతో, కాలుష్యం లెవల్ పెరిగిపోవటంతో దాదాపు అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.గాలిలో నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోవడంతో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐంఎఏ) కోరుతోంది.

ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి చుట్టు పక్కల ప్రాంతాల్లో గడ్డిని కాల్చేయటంతో ఆ పొగ మొత్తం నగరాన్ని చుట్టేసింది. పొగ మొత్తం నగరాన్ని కమ్మేసి నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సోమవారం సాయంత్రమే ప్రారంభమైన వాయుకాలుష్యం మంగళవారం ఉదయానికి తీవ్రమైంది. కేంద్ర వాతావరణ శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డులు విడుదల చేసిన వివరాల ప్రకారం వాయు నాణ్యత సూచీ రోజంతా దాదాపు 500 ఉంది. దీంతో రంగంలోకి దిగిన కేజ్రీవాల్ ప్రభుత్వం నివారణ చర్యలు ప్రారంభించింది.అత్యవసరం అయితే తప్ప పెద్దలు కూడా ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని.. ముఖ్యంగా ఉదయం పొగ మంచులో తిరగకూడొద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ బయటికి వస్తే మాస్కులు తప్పనిసరి ధరించాలని సూచించింది.

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యలను సూచించడానికి సుప్రీం ఏర్పాటు చేసిన పర్యావరణ కాలు ష్య నివారణ, నియంత్రణ సంస్థ(ఈపీసీఏ) మంగళవారం పలు సిఫారసులు చేసింది. పొగకు వాహనాలు కూడా కారణమే కాబట్టి ఢిల్లీలో పార్కింగ్‌ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచాలని సూచించింది. అదేసమయంలో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించేలా జనాన్ని ప్రోత్సహించడానికి మెట్రో రైలు టికెట్ల ధరలను సగానికి తగ్గించాలని సిఫారసు చేసింది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి ‘ఆడ్‌ - ఈవెన్‌’ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని పేర్కొంది.కాలుష్య నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణ సంస్థలకు రూ.50 వేల జరిమానా విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ఢిల్లీ ప్రభుత్వం అంగీకరించింది.

దట్టంగా అలుముకున్న పొగ వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 33 రైళ్లు మూడు గంటలకుపైగా ఆలస్యంగా నడిచాయి. ఈ నెల 19న నిర్వహించతలపెట్టిన మారథాన్‌ను రద్దు చేయాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles