Ruling TRS mlc slaps nri woman with slipper ఎన్నారై మహిళపై చెప్పుతో దాడి చేసిన ఎమ్మెల్సీ..

Ruling trs mlc slaps nri woman with slipper

TRS mlc Farooq Hussain, MLC Farooq Hussain, Farooq Hussain, Farooq Hussain nri woman, Farooq Hussain manhandle, Farooq Hussain slaps women, mlc Farooq Hussain slaps women, Farooq Hussain slaps nri woman, NRI woman, slipper, house owner, nampally, vaccate, crime

Ruling TRS MLC Farooq Hussain manhandled NRI woman with slipper, according to sources the flat owner of hussain urged him to vaccate her house, this demand turned down since two years. today when she came personally and asked him to vaccate her flat this inccident took place.

ఎన్నారై మహిళపై చెప్పుతో దాడి చేసిన ఎమ్మెల్సీ..

Posted: 10/09/2017 11:00 AM IST
Ruling trs mlc slaps nri woman with slipper

చట్టసభలకు ఎన్నికైనంత మాత్రాన విజ్ఞత మర్చిప్రవర్తిస్తున్నారు ప్రజా ప్రతినిధులు.. ఓ ప్రజాప్రతినిధి తాను ఎక్కడి వెళ్లిన తాను చేసే అభివృద్ది పనులకు ప్రచారం చేసుకోవడం కన్నా.. తన అభిమానులు, కార్యకర్తలపై చేయి చేసుకునే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్సీ కూడా ఇలాంటి దారుణానికే ఒడిగట్టారు. తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ఎదుట అందోళనకు దిగిన మహిళపై జులుం చేశారు.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో.. తాను చెప్పిందే రాజ్యం.. చేసిందే శాసనం అన్న రీతిలో వ్యవహరిస్తూ.. సదరు మహిళను తన దిక్కున్న చోట చెప్పుకోవాల్సిందని అమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నాంపల్లిలోని ఓ ఫ్లాటులో అద్దెకు వుంటున్నారు. శాసనమండలి సహా సెక్రటేరియట్ మిగతా అన్ని ప్రాంతాలు నిమిషాల వ్యవధిలోనే వెళ్లి వచ్చేందుకు వీలుగా ఎన్నారై దంపతులకు చెందిన ఇంటికి అద్దెకు తీసుకున్నారు.

గత కొన్నేళ్లుగా అక్కడే వుంటున్న హుస్సేను కుటుంబాన్ని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సదరు ఎన్నారై మహిళ గత రెండేళ్లుగా ఫోన్ ద్వారా కోరుతూ వస్తుంది. అయితే దానిని పెడచెవిన పెట్టిన ఎమ్మెల్సీ.. అంతగా పట్టించుకోకకుండా పలు కారణాలు చెబుతూ వచ్చారు. దీంతో తన ఇంటిని ఖాళీ చేయమంటే కాలయాపనలో కాలాన్ని వెల్లబుచ్చుతున్న నేపత్యంలో ఇంటి యజమానురాలు ఏకంగా హైదరాబాద్ కు వచ్చింది. తాజ్ హోటల్ లో బస చేస్తూ.. గత మూడు రోజులుగా ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా కోరుతుంది.

ఇవాళ్ల ఉదయం కూడా తన బంధువులను వెంటబెట్టుకుని..  ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సెన్ ఇంటికి వెళ్లింది. ఇళ్లు తక్షణం ఖాళీ చేయాలంటూ కోరింది. అయినా అయన పట్టించుకోకపోవడంతో ఇంటి ఎదుట అందోళనకు దిగింది. దీంతో ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుకుందామని చెప్పిన ఎమ్మెల్సీ.. మాటల మధ్యలో అకస్మాత్తుగా అమెపై చెప్పు తీసుకుని చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనను అమె బంధువులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇల్లు ఖాళీ చేయమని కోరినందుకు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అత్యంత హేయకరైన చర్యకు పాల్పడ్డారని వారు అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  MLC  Farooq Hussain  manhandle  NRI woman  slipper  house owner  nampally  vaccate  crime  

Other Articles