గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్ లో ఆ రూట్లో మాత్రం అస్సలు వెళ్లకండి | Traffic Diversions Ganesh immersion 2017 in Hyderabad

Ganesh immersions 2017 hyderabad traffic restrictions

Hyderabad, Ganesh Immersion 2017, Hyderabad Ganesh Nimajjanam 2017, Ganesh Nimajjanam Traffic in Hyderabad, Traffic Divert Hyderabad, Traffic Diversions Ganesh immersion

The Cyberabad Police on Wednesday announced the imposition of traffic restrictions for Ganesh immersion ceremony in the city on September 5, next Tuesday. In a press release here, Cyberabad Commissioner of Police Sandeep Shandilya Make an announcement.

గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు

Posted: 09/02/2017 07:32 AM IST
Ganesh immersions 2017 hyderabad traffic restrictions

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి నగర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 5 సెలవు ప్రకటించిన ప్రభుత్వం భద్రతను కూడా కట్టుదిట్టం చేసేసింది. ఇక నిమజ్జనం సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ శాండిల్య పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కొన్ని రూట్లలో చిన్న చిన్న దారి మళ్లింపులు చేపట్టగా, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు.

బోయిన్ పల్లి, సికింద్రాబాద్, ఇతర కాలనీల నుంచి హన్మత్ పేట చెరువు వద్దకు వినాయక విగ్రహాలతో వచ్చే వాహనాలు.. అంజయ్యనగర్ మీదుగా ఇక్కడికి చేరుకోవాలని, నిమజ్జనం అనంతరం, ఓల్డ్ బోయిన్ పల్లి, మస్క్యూ రోడ్, హరిజన బస్తీ మీదుగా వెళ్లాలని సూచించారు. అదే విధంగా, ఐడీఎల్ చెరువు వద్దకు నిమజ్జనం నిమిత్తం వచ్చే వాహనాలు గోద్రెజ్, జేఎన్టీయు మీదుగా ఐడీఎల్ జంక్షన్ చెరువు వద్దకు చేరుకోవాలని, ఆ తర్వాత రెయిన్ బో విస్టా, నైనా గార్డెన్ వైపునకు వెళ్లాలని సూచించారు.

ఇక, బాలానగర్ - ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రెజ్-ఎర్రగడ్డ, మియాపూర్-గోద్రెజ్, ఫిరోజ్ గూడ- గోద్రెజ్, గుడెంమెట్- నర్సాపూర్ క్రాస్ రోడ్ మార్గాల్లో భారీ వాహనాలను నిమజ్జనం రోజుల్లో అనుమతించమని చెప్పిన శాండిల్య, ఆరాంఘర్ క్రాస్ రోడ్ నుంచి బహదూర్ పుర మార్గంలో ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతి లేదని తెలిపారు. మెట్రో పనుల కారణంగా భారీ విగ్రహాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.


ఆర్టీసీ ఎక్స్ ట్రా బస్సులు..

ఈ నెల 5న జరిగే గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి 500 ప్రత్యేక బస్సులు ట్యాంక్‌బండ్‌ వరకు నడిపేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతామని చెప్పారు. గ్రేటర్ జోన్‌ 29 డిపోల నుంచి నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, పలు జిల్లాల నుంచి నిమజ్జన వేడుకలు తిలకించే నిమిత్తం హైదరాబాద్ వచ్చే వారి కోసం జూబ్లీ బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ నిమిత్తం 50 మంది అధికారులు, 100 మంది సూపర్‌ వైజర్లు పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు పురుషోత్తం పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Ganesh Immersion 2017  Traffic Restrictions  

Other Articles