Telangana government bans plastics used in carry bag వ్యాపారులకు, ప్రజలకు తెలంగాణ సర్కార్ షాక్

Telangana government bans plastics used in carry bag

telangana government, national green tribunal, plastic bags, ban plastic, Polyvinyl Chloride (PVC), chlorinated plastics, bulk waste burning, simple burning, hyderabad, telangana

The Telangana state government has imposed a ban on short-life Polyvinyl Chloride (PVC) and chlorinated plastics in the state.

వ్యాపారులకు, ప్రజలకు తెలంగాణ సర్కార్ షాక్

Posted: 07/11/2017 12:18 PM IST
Telangana government bans plastics used in carry bag

తెలంగాణ సర్కార్ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంది. జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా క్లొరినేటెడ్ ప్లాస్టిక్ వాడకంతో పాటు పాలీ వినైల్ క్లొరైడ్ వాడకాలపై పూర్తిగా నిషేధాన్ని విధించనుంది. గతేడాది డిసెంబర్ లో ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు మేరకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నూతన ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు రానుంది.  

అసెంబ్లీ తీర్మాణం పోందిన తరువాత ఈ చట్టం అమల్లోకి రానుంది. దీంతో ఇక తెలంగాణలో స్వల్పకాలిక పాలివినైల్ క్లోరైడ్ తో పాటు క్లొరినైటేడ్ ప్లాస్టిక్స్ వినియోగం వాడకంపై పూర్తిగా బ్యాన్ విధించనున్నట్లు తెలుస్తుంది.దీంతో పాటు జాతీయ ట్రిబ్యూనల్ ఇచ్చిన అదేశాల ప్రకారం బహిరంగంగా చెత్తను కాల్చడం.. పెద్ద మొత్తంలో, చిన్న మొత్తంలో కాల్చినా ఇక పై జేబులకు చిల్లులు పడాల్సిందే. పర్యావరణకు హానీ కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝుళిపించనుంది.

అదెలా అంటే.. పెద్ద మొత్తంలో చెత్తను బహిరంగంగా కాల్చిన పక్షంలో 25 వేల రూపాయలు, చిన్న మొత్తంలో కాల్చిన పక్షంలో ఐదు వేల రూపాయల జరిమానా విధించనున్నారు. ఇది పర్యావరణ పరిహారంగా చెత్తను కాల్చిన వారి నుంచి వసూలు చేయనున్నట్లు ముసాయిదా చట్టంలో పేర్కోన్నారు. ఈ ముసాయిదా బిల్లుపై ఎవరికైనా అభ్యంతరాలు వున్నా.. లేక సూచనలు చేయాలని భావించినా.. వారు మెంబర్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాల్యుష్య నియంత్రణ మండలి, పర్యావరణ భవన్, ఏ3, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, సనత్ నరగ్ హైదరాబాద్ కు పంపించాల్సిందిగా కాలుష్యనియంత్రణ మండలి అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles