Former Union Minster dregged Vajpayee name in Beef Row

Modi and vajpayee names in beef row

PM Narendra Modi, Modi Eats Beef, Vajpayee Served Beef, Chinta Mohan Atal Bihari Vajpayee, vajpayee Modi Beef, Beef Row Comments, Kerala Beef Law Passed, Kerala Ex CM Beef Modi, Former Union Minster Comments on Modi

Congress Leader, Former Union Minster Chinta Mohan semsation Comments on Former PM Vajpayee. He served Beef in A meet in 1997. former Kerala Chief Minister VS Achuthanandan says Modi Also Eat Beef in Foreign Trips.

గొడ్డు మాంసం గోల.. వాళ్లనూ లాగారు

Posted: 06/09/2017 10:12 AM IST
Modi and vajpayee names in beef row

గోవధ, బీఫ్ బ్యాన్ గురించి ఓవైపు దేశమంతా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ నేతల వ్యవహార శైలితో మరింత ఆసక్తికరంగా మారుతోంది. కేరళలో బీఫ్ బ్రేక్ ఫాస్ట్ రచ్చ ఇంకా ముగియక ముందే ఇప్పుడు మరో వివాదం రాజేశాడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఏకంగా ఈ వివాదంలోకి వాజ్ పేయిని లాగుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మాజీ ప్రధాని వాజ్ పేయి స్వయంగా గొడ్డు మాంసాన్ని వాజ్ పేయి తమకు వడ్డించాడని చెబుతున్నాడు. 1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్ పేయి... తనతో పాటు, బీఎస్పీ అధినేత కాన్షీరామ్ ను విందుకు ఆహ్వానించారని...తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటకాలను స్వయంగా వడ్డించారని చెప్పాడు. అంతేకాదు ఈ పని చేసిన ఏడాది కాలానికే ఆయన ప్రధాన మంత్రి అయ్యాడంటూ చెప్పుకొచ్చాడు.

భారతదేశంలో ఎవరు ఏది తినాలో, ఏది తినకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన తెలిపారు. బీఫ్ అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు.

 

మోదీ మీరూ తినేది బీఫే...


కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ కూడా బీఫ్ తింటాడంటూ పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ అక్కడ కార్పొరేట్ డెలిగేట్స్ తో సమావేశాల్లో పాల్గొనే టైంలో గొడ్డు మాంసాన్నే తింటాడంటూ తెలిపాడు. గతంలో 2003 లో వాజ్ పేయి కూడా బీఫ్ తిన్నాడంటూ పేర్కొన్న ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యలతో పెద్ద కలకలాన్నే రేపాడు. ఇదిలా ఉంటే గోమాంసం స్వేచ్ఛగా విక్రయించేందుకు, తినేందుకు అవసరమైన చట్టాన్ని విజయ్ పినరయి ప్రభుత్వం కేరళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beef Row  Atal Bihari vajpayee  Narendra Modi  

Other Articles