Rats Drink Illegal Liquor Worth Crores in Bihar

Seized liquor missing in bihar

Rats Drink Illegal Liquor, Rats Liquor, Rats Drink Liquor, Bihar Rats, Rats Police, Bihar Police Rats, Rats Seized Liquor, Rtas Drinking Liquor, Rats Drink. Seized Liquor Missing, Rats Liquor Bottle, Drunken Rats, Nitish Kumar Rats

Seized liquor missing in Bihar. Humans can't, rats 'drink' illegal liquor worth crores in Bihar Cops Confirmed.

మందు బాటిళ్లను ఎవరు ఖాళీ చేస్తున్నారంటే...

Posted: 05/04/2017 07:31 AM IST
Seized liquor missing in bihar

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను ఖాళీ చేసేశాయి ఎలుకలు. ఈ విషయం అనౌన్స్ చేసింది ఎవరో కాదు పాట్నా ఎస్ఎస్పీ మను మహారాజ్. బాటిళ్ల మూతలను కొంచెం కొంచెంగా కొరికి మొత్తం సీసాళ్లన్నీ ఖాళీ చేశాయి. నోరు లేని ఆ మూగజీవాలు చేసిన పనికి అనవసరంగా మనుషులను అనుమానించారు ఉన్నతాధికారులు.

విషయం ఏంటంటే.. బీహార్ లో సంపూర్ణ మద్యపానం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ అధికారం చేపట్టగానే తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఆదర్శంగా నిలిచింది కూడా. అయితే అక్రమ మద్యసరఫరా జోరుగా సాగుతూనే వస్తోంది. ఇప్పటిదాకా 40,000 మందిని ఆయా కేసుల్లో అరెస్ట్ చేయగా, రీసెంట్ గా కోట్లాది సరుకును పట్టుకున్న పోలీసులు స్టోర్ రూమ్స్ లో పెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. మందుబాటిళ్లు ఒకదాని వెంట మరోకటి ఖాళీ అయిపోతున్నాయి.

దీంతో సిబ్బంది ఏమైనా ఈ సీసాలను ఖాళీ చేస్తున్నారేమోననే అనుమానం మను మహరాజ్ కు తలెత్తింది. వెంటనే, ఆ గదులకు కాపలా కాస్తున్న సిబ్బందికి బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేయించాడు. ఏ ఒక్కరూ పట్టుబడలేదు. అయితే, ఈ టెస్టుకు ఓ కానిస్టేబుల్ అంగీకరించకపోవడంతో ఆయన్ని పదవి నుంచి కూడా తొలగించారు. కానీ, మద్యం సీసాలను ఎవరు ఖాళీ చేస్తున్నారనే విషయం మాత్రం తేలలేదు. దీంతో, డీప్ గా దర్యాప్తు చేస్తే.. చివరకు ఎలుకలు దోషులుగా తేలాయి.

పోలీస్ స్టోర్ రూమ్స్ నిండా విపరీతమైన ఎలుకలు ఉండటంతో.. మద్యం సీసాల మూతలను కొంచెం కొంచెంగా కొరికేసి...మందు కొట్టేస్తున్నాయని తేలింది. ఒకటో రెండో మద్యం బాటిల్స్ కాదు..ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎంచక్కా ఎలుకలు తాగేశాయిని తేలింది. దీంతో, పోలీసు సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అన్ని పోలీస్ స్టోర్ రూమ్స్ లో ఎలుకలు లేకుండా చేయాలని ఆదేశించాడు. నమ్మశక్యంగా లేదు కదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Illegal Liquor  Rats Drink  

Other Articles