కోల్ కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎస్ కర్నర్ మరోసారి వివాదాస్పదంగా మారాడు. ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ను తన ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశాడు. గురువారం ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించాడు. కర్నర్ కథేంటి?
గతంలో వివాదాస్పద ఆదేశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కర్నన్ పై గతంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టు ధిక్కారం కేసులో ఆయనపై అరెస్ట్ వారెంటు కూడా జారీ చేసింది. దీంతో రివెంజ్ చర్యలకు దిగిన కర్నన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ సహా మరో ఆరుగురు న్యాయమూర్తులను ఏప్రిల్ 28న కోల్‌కతాలోని తన నివాసంలో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసి కలకలం రేపాడు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయిన తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఏంటని, అవసరమైతే తనని అరెస్ట్ చేసి బోనులో నిలపాలని వ్యాఖ్యలు చేశాడు కూడా. ఇక తీర్పు సందర్భంగా తనపై కుట్రపూరిత ఆదేశాలు జారీ చేసిన వారంతా తన ఎదుట హాజరుకావాలంటూ ఆదేశాలివ్వటం తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడు నుంచి తనని కోల్ కతాకు ట్రాన్స్ ఫర్ చేయటం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెడతానని ప్రకటించడటంతో మరింత ముదిరింది.
అయితే ఓ హైకోర్టు న్యాయమూర్తికి దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ప్రశ్నించే పవర్ ఉందో లేదో స్పష్టంగా తెలీనప్పటికీ ఆయన దూకుడుకు సుప్రీం ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more