కొత్త నోట్లతో జరంత జాగ్రత్త.. ఏం జరుగుతోందసలు? | Fake Currency Rocket busted in Gujarat.

Huge volume of fake currency seized in india

Fake Currency Rocket, Gujarat Fake Currency, Indian New Notes Fake, Indian Fake Currency, Fake Currency Rocket, Fake Currency Seize, Be careful with New Notes, Crores of Fake Notes

Gujarat financier’s arrest leads to seizure of Rs 4.49 crore in fake notes. Beside this Two arrested as fake currency seizures continue near Bangladesh border.

కొత్త కొత్త నోట్లు... బీ కేర్ ఫుల్!

Posted: 03/06/2017 10:23 AM IST
Huge volume of fake currency seized in india

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత అవి ప్రజలకు అందుబాటులోకి రావటానికి చాలా సమయమే పట్టింది. ఆ నలభై రోజుల సమయంలో ప్రజలు ఎదుర్కున్న చిక్కులు వర్ణనాతీతం. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొత్తవి విడుదల కావటంతో సమస్య పరిష్కారం త్వరగతినే అయ్యింది. కానీ, అదే సమయంలో ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే సీన్లు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. అదే ఫేక్ నోట్ల వ్యవహారం.

నిజానికి కొత్త నోట్లు రిలీజ్ అయ్యాక అవి పాక్ లాంటి ఫేక్ కరెన్సీ ముద్రించే దేశాలకు మన కొత్త కరెన్సీ చేయటం చాలా కష్టమైన పని అని ఆర్థిక శాఖ ధైర్యంగా ఓ ప్రకటన చేసింది. కానీ, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన వాళ్లే వాటిని యథేఛ్ఛగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి భారీ మొత్తంలో దొంగ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఏకంగా రూ. 4.5 కోట్ల విలువైన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీటీని స్వాధీనం చేసుకున్నారు.

ఓ ఫైనాన్షియర్ అయిన కేతన్ దవేపై అనుమానంతో తుక్కు డీలర్ నితిన్ అజానీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దవేను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దవే కార్యాలయంలో పోలీసుల సోదాల్లో భారీగా దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా తన సహచరులు పార్థ్ తెరియా, ఉమర్ గజ్జర్ అనే ఇద్దరు దాదాపు కోటి రూపాయల దొంగ నోట్లను తగలబెట్టేశారని దవే చెప్పాడు. గజ్జర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కార్లలో దొంగ నోట్లను దాచే అలవాటు దవేకు ఉందని చెప్పాడు.

దీంతో, దవే కార్లలో వెతగ్గా వాటిలో కూడా మరిన్ని దొంగనోట్లు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇక ఆ పేక్ కరెన్సీని లెక్కించటానికి పోలీసులకు రాత్రంతా సమయం పట్టిందంట. ఇంకోవైపు బయటి దేశాల నుంచి కూడా భారీ ఎత్తున దొంగ నోట్ల ప్రవాహం గురించి వార్తలు రావటం విశేషం. మొన్నే బంగ్లాదేశ్ కి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు 3 లక్షల ఫేక్ నోట్లతో దొరికిపోవటంతో సరిహద్దులో నిఘాను పటిష్టం చేయాలని పోలీసులు ఆర్మీని కోరారు. దీంతో కరెన్సీ నోటును తీసుకునే ముందు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు.

 

గీతలుంటే పనికి రావా?

 

1999 నాటి 'క్లీన్ నోట్' పాలసీ నిబంధనల ప్రకారం బ్యాంకులు నడుచుకోవాల్సిందేనని, చిరిగిన, గీతలు, రాతలున్న నోట్లను తీసుకోకుంటే, రూ. 10 వేల వరకూ జరిమానా విధిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఇటీవలి కాలంలో కొత్త నోట్లు నలిగినా, చిరిగినా, వాటిపై రాతలు రాసినా బ్యాంకులు స్వీకరించబోవంటూ, పైగా హోలీ దగ్గర్లో ఉండటంతో రంగులు పడితే చెల్లవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. పాడైన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని తెలుపుతూ, కస్టమర్లను ఇబ్బందులు పెట్టవద్దని బ్యాంకులకు సూచించింది. అయితే, రోజుకు 20 నోట్లు లేదా రూ. 5 వేలకు మించి నోట్లను మార్చేందుకు మాత్రం సర్వీస్ చార్జీలను వసూలు చేసుకునే అధికారం బ్యాంకులకు ఉందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake Currency  New Notes  India  

Other Articles