పళనీయమ్మకి టెస్ట్.. తమిళనాట హైటెన్షన్... ఏం జరగబోతుంది? high tension in Tamil Nadu due to trust Vote.

Panneerselvam office attacked before trust vote

Tamil Nadu High Alert, Palaniswamy Government, DMK Congress Tamil Nadu, Palanisamy Floor Test, Tamil Nadu Assembly Trust Vote, Panneerselvam office Attack, Assembly Trust Vote

Tamil Nadu high alert due to Confident test. DMK Congress opposed Palaniswamy Govt. Panneerselvam office attacked.

సెల్వం ఆఫీస్ పై దాడి.. తమిళనాడులో టెన్షన్

Posted: 02/18/2017 09:52 AM IST
Panneerselvam office attacked before trust vote

బలపరీక్షలో గనుక ఓడిపోయినట్లయితే మరో ఉద్యమానికి తెరలేపబోతున్నాడు విధేయుడు పన్నీర్ సెల్వం. పళనిస్వామికి సపోర్ట్ గా గనుక ఎమ్మెల్యేలు ఓట్లు వేసినట్లయితే వారిని ప్రజా కోర్టకు ఈడ్చేందుకు సిద్ధమవుతానని ప్రకటించాడు కూడా. మరోవైపు నేడు బలనిరూపణ సందర్భంగా కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నాం నుంచి ఓటింగ్ ప్రారంభయ్యే అవకాశం ఉంది. అయితే రహస్య ఓటింగ్ చేపట్టాలంటూ స్పీకర్ పై పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

ఇదిలా ఉంటే భారీ కాన్వాయ్ నడుమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. చెన్నై లో ఎప్పుడు ఏం అలజడి రేగుతుందోనన్న పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు భద్రతను పెంచారు. తేని జిల్లా బోడియనాయకనూర్ లోని పన్నీర్ సెల్వం కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డకున్న పన్నీర్ మద్ధతుదారుడు రాజ్ వేల్ పై దాడి చేశారు కూడా. మరోవైపు పళని ఎమ్మెల్యేల సంఖ్య 122కి పడిపోయింది. నిన్న రాత్రి రిసార్ట్ నుంచి బయలుదేరిని మరో ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని చెబుతూ ఓటింగ్ కు దూరమని ప్రకటించాడు.

కాగా, 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో జయ మృతిలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, బలపరీక్ష గెలవాలంటే 116 మంది సభ్యుల మద్ధతు ఈపీఎస్ కు అవసరం. మరో ఆరుగురు ఎమెల్యేలు గనుక చేజారితే మాత్రం పళనీ పరిస్థితి ఇక అంతే. 40 మంది అసంతృప్తులు ఉన్నారన్న వార్త కాస్త కంగారు పెడుతోంది.

ఇక ఓటు వేసే ముందు అమ్మను తలుచుకోవాలంటూ పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చాడు. ప్రజలు అమ్మను చూసే అధికారం కట్టబెట్టారని, కుటుంబ పాలనకు ఆమె పూర్తి విరుద్ధమని, శశికళ లాంటి వాళ్ల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లితే సర్వనాశనం అవుతుందని ఈ ఉదయం మరోసారి మీడియా సాక్షిగా ఎమ్మెల్యేలను కోరాడు. ప్రతిపక్ష డీఎంకే తరపున అనారోగ్య సమస్యతో కరుణానిధి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

బలాబలాలు..

అన్నాడీఎంకే - 135 (124 మంది సపోర్ట్ ఉన్నారని పళని చెబుతున్నాడు) 
డీఎంకే - 89
కాంగ్రెస్ - 8
ముస్లింలీగ్ - 1
పన్నీర్ వర్గం - 11


డీఎంకే వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పగా, కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారంలో చివరి నిమిషంలో వ్యతిరేక ఓటుకే మొగ్గుచూపింది.. మిగతా వారు తటస్థంగా ఉండే అవకాశం ఉంది?


పళనియమ్మ జోక్... పేలిపోతుంది

దివంగత ముఖ్యమంత్రి జయలలితను తమిళనాడు ప్రజలు ముద్దుగా అమ్మ అని పిలుచుకుంటారని తెలిసిందే. మరోవైపు ఆమెను అనుసరిస్తూ వచ్చిన శశికళ నటరాజన్ ను కూడా చిన్నమ్మ అని సంభోదిస్తూ వస్తున్నారు. వీళ్ల విషయంలోనే కాదు.. తమిళనాడులో కాస్త క్రేజ్ తో జనాల్లోకి దూసుకెళ్లిన వాళ్లను తంబీలు ఏదో ఒక వరుసపెట్టి పిలవటం సహజమే. అన్నాడీఎంకే లో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. పురుచ్చితలైవా, పురుచ్చితలైవి తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ చిన్నమ్మకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు కూడా.

ఇదిలా ఉంటే, కొత్త సీఎం పళనిస్వామి విషయంలోనూ ఇప్పుడు ఇదే జరిగింది. కాకపోతే సీన్ కాస్త కామెడీగా మారిపోయింది. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ పళనిస్వామి గురించి గొప్పగా వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కాస్త అతితో పళనిస్వామికి బదులు ‘పళనియమ్మ’ అనేసింది. అంతే ఆమెపై జోక్స్ పేలుతున్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో జోక్స్ కురిపిస్తున్నారు. ‘అమ్మ’, ‘చిన్నమ్మ’ అని పలికిన నోటికి ‘పళనియమ్మ’ అని కాక, ఇంకేమొస్తుందంటూ ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Cm Palanisamy  Floor Test  Trust Vote  

Other Articles