నయీంతో పోలీసులకు లింకులు.. సాక్ష్యాలివిగో... | Proofs for Nayeem-Police Officers Link viral.

Nayeem links with polices photos viral

Gangstar Nayeem, Gangstar Nayeem Encounter, Gangstar Nayeem Relations, Gangstar Nayeem Links, Gangstar Nayeem Police Officials, Gangstar Nayeem Rare Photos, Gangstar Nayeem Photos, Gangstar Nayeem Social Media, Gangstar Nayeem Maddipati Srinivas Rao, Gangstar Nayeem SIT, Gangstar Nayeem Clean Chit, Gangstar Nayeem Secret Photos

Police Officials relations with Gangstar Nayeem come to light new photos viral in Social Media.

నయీంతో పోలీసుల పార్టీలు... ఫోటోలు వైరల్

Posted: 02/02/2017 10:05 AM IST
Nayeem links with polices photos viral

గ్యాంగ్ స్టర్ గా తెలుగు రాష్ట్రాలను గడగడలాడించి ఎన్ కౌంటర్ లో హతమైన నయీంకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దందాలతో వందల కోట్ల సంపాదించిన నయీంకు పోలీస్ శాఖలోని కొందరు కీలక అధికారులు, రాజకీయనేతలతో సత్ససంబంధాలు ఉండేవని ఆ మధ్య బయటపడింది. అయితే ఎటువంటి ఆధారాలు లేవంటూ నయీం కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కోర్టుకు తెలుపటం విశేషం. ఈ నేపథ్యంలో నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు బట్టబయలయ్యాయి.

సుమారు 16 మంది పోలీసు ఉన్నతాధికారులు నయీంతో విందు వినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ సిట్ అధికారులు వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావినిస్తోంది. ముఖ్యంగా సీడీఐ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. గతంలో నల్లగొండ జిల్లాలో పని చేసి ప్రస్తుతం సీఐడీలోనే ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.

మద్దిరెడ్డితో లింకులు...
మద్దిరెడ్డి గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. కీలకమైన సమాచారం అందజేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ నయీంకి సహకరించేవాడని మద్దిపాటిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సిట్ తేల్చటంతో కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆధారాలు బయటకు రావడంతో ఇక ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Nayeem Maddipati Srinivas Rao

Nayeem Police Links

నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వటంతో నచ్చని కొందరు సిట్ అధికారులే ఈ ఫోటోలను లీక్ చేశారని సమాచారం.

Gangster Nayeem Links Social Media

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangstar Nayeem  Police Oficials  Links  Photos  

Other Articles