ఫేస్ బుక్ లైవ్ లోనే కిరాతకంగా గ్యాంగ్ రేప్. అక్కడ తుపాకీ పెట్టి... బట్టలు చించేసి.. కొరికి... | Gang Rape In Sweden Streamed Live On.

Gang rape live streamed on facebook in sweden

Facebook Gang rape, Sweden Gang Rape, Gang Rape Streamed Live, Sweden Gang Rape, Facebook Live Stream, Facebook Live Stream Gang Rape, Gun Point FB Gang Rape, Gang Rape Live

Gang rape streamed live on Facebook in Sweden. Three suspects arrested. Armed men stream 'three-hour gang rape' on Facebook Live after 'holding terrified victim at gunpoint'.

దారుణం: ఫేస్ బుక్ లైవ్ లో గ్యాంగ్ రేప్

Posted: 01/24/2017 03:07 PM IST
Gang rape live streamed on facebook in sweden

మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగిపోతున్న క్రమంలో మానవత్వాన్ని మరిచి ఓ మూడు మృగాలు చేసిన వికృత క్రీడ సంచలనంగా మారింది. ఓ 30 ఏళ్ల మహిళను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేయటమే కాదు, దానిని ఆన్ లైన్ లైవ్ చూపించిన ఘటన కలకలం రేపుతోంది.

స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ముగ్గురు యువకులు ఓ మహిళపై అతిదారుణంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా 60000 మంది ఉన్న ఓ ఫేస్ బుక్ గ్రూప్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఆ కిరాతకానికి పాల్పడ్డారు. ఆ వీడియోను చూసిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది.

బట్టలు చించేస్తూ ఉంటే మహిళ సాయం కోసం అరవటం, అందులో ఒకడు గన్ తో యువతిని బెదిరించటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా సరదాగా (ఫ్రాంక్ ) చేసిన యవ్వారం అనుకున్న పోలీసులకు రేప్ జరిగింది నిజమేనని తేలటంతో షాక్ తగిలినట్లయ్యింది. వీడియో ఆధారంగా ఆ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేలాది మంది ఆ వీడియోను తిలకించేశారని, అంతేకాదు దానిని తొలగించాల్సిందిగా ఫేస్ బుక్ ను కోరినట్లు వారు చెబుతున్నారు. మంచి చెడు అన్న తేడా లేకుండా.. ఇలాంటి వికృత క్రీడలను సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించేవారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sweden  Gang Rape  Facebook  Live Stream  

Other Articles