సాయం చేయడానికి వెళ్లి శవాలుగా మారారు | 30 dead in Plasco building collapse.

More than 25 firefighters dead in tehran building collapse

Iran Fire Accident, Tehran building collapse, Plasco tower, Firefighters death, Tehran Fire Mishap, Building Collapse, Plasco tower accident, Tehran accident, Iran news, Iran fire mishap, Building Fire Accident, firemen Iran

Dozens die as Iran's Capital Tehran blazing Plasco tower crumbles in seconds. Iconic Plasco building collapses killing 25 firefighters, 5 civilians.

సాయం చేయడానికి వెళ్లి శవాలుగా మారారు

Posted: 01/20/2017 08:09 AM IST
More than 25 firefighters dead in tehran building collapse

తమ విధి నిర్వహణలో భాగంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో గురువారం సంభవించిన ఘోర అగ్ని ప్ర‌మాదం లో 30 మంది అక్కడిక్కడే చనిపోయారు. ప్ర‌సిద్ధి చెందిన‌ ప్లాస్కో భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించటం, అగ్నిమాపక సిబ్బంది అక్క‌డికి చేరుకొని వాటిని అదుపులోకి తెస్తుండ‌గా భ‌వ‌నం కుప్పకూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది.

1962 లో నిర్మించిన 17 అంతస్థుల ఈ భవనం టెహ్రాన్ లో అప్పట్లో ఎత్తైన కట్టడం. ప్రసిద్ధ షాపింగ్ మాల్ గా ఇది చాలా పాపులర్ అయ్యింది. గురువారం రాత్రి 9వ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా మొత్తం బిల్డింగ్ అంతటికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సుమారు 200 మంది ఉద్యోగులతో సహయక చర్యలు చేపట్టింది. అయితే భవనం క్షణాల్లో పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలిపోవటంతో చాలా మంది సజీవ సమాధి అయ్యారు. 25 మంది ఫైర్ మెన్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 75 మంది గాయపడ్డారు. వారిలో 30 మంది సాధారణ పౌరులు కాగా, 45 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ భ‌వ‌నం వ‌ద్ద స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భ‌వనాన్ని 1960లో జ్యూయిష్‌ వ్యాపారవేత్త హబిబ్‌ ఎల్గానియన్‌ నిర్మించాడు. 1979 లో ఇస్లామిక్ విప్లవం సందర్భంగాఇజ్రాయెల్ గుఢాఛారిగా పనిచేశాడని అతన్ని ఇరాన్ ఉరితీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iran  Tehran  Plasco tower  Fire Accident  Collapse  

Other Articles