మొగుడు ముందే చున్నీలాగి మరీ ఘోరం | Mainpuri new couple attack.

Sexual assaulting girl at mainpuri uttarpradesh

Newly wedded couple, couple mercilessly beaten, Mainpuri couple attack, sexual assaulting girl, Newly wedded couple, eve teasing in mainpuri, UP couple attack, Mainpuri new couple

Newly wedded couple mercilessly beaten after eve teasing in mainpuri.

ITEMVIDEOS:భర్త ముందే భార్య చున్నీలాగి మరీ...

Posted: 12/21/2016 01:52 PM IST
Sexual assaulting girl at mainpuri uttarpradesh

కొత్తగా పెళ్లైన జంట ఆకతాయిల బారిన పడ్డారు. యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ అవమానాన్ని సహిస్తూ ఊరుకోక ఏంటని ఎదురు ప్రశ్నించారు. అదే వారు చేసిన పాపం అయ్యింది. వారిపై ఘోరంగా దాడి చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన యూపీ లోని మెయిన్ పురిలో చోటుచేసుకుంది.

ఓ యువ జంట తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు ఆకతాయిల కంట్లో వీళ్లు పడ్డారు. ఓ దుండగుడు వచ్చి యువతి దుప్పట్టాను లాగుతూ, అసభ్య చర్యలకు దిగాడు. దీన్ని చూసిన ఆమె భర్త వారించగా, ఆపై యువతి కూడా గట్టిగా నిలదీసింది. అంతే కోపం తెచ్చుకున్న ఇద్దరు వచ్చి వారిని కర్ర తీసుకుని కొట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనలో యువతి తలకు గాయాలయ్యాయి.

 

మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడది వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చున్నీలాగగా, మరో వ్యక్తి కర్రతో ఇష్టం వచ్చినట్లు బాదుతున్నాడు. దాడి చేసిన వారిలో ఒకతని పేరు ఆనంద్ యాదవ్ అని, రాజకీయంగా అతనికి పలుకుబడి ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వయానా ములాయం సింగ్ ఇలాకాలోనే ఇలా జరగటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mainpuri new couple Attack  sexual assaulting  

Other Articles