విదేశీ వేశ్య గృహాలకు తూగో అమ్మాయిలు | East Godavari girls export to Foreign brothel houses

East godavari girls export to foreign brothel houses

East Godavari girls export to Foreign brothel houses, East Godavari girls export, sex racket in east Godavari, AP girls export to foreign, AP girls in foreign brothel houses

East Godavari girls export to Foreign brothel houses sex racket Busted.

ఏపీ అమ్మాయిలను విదేశీ వేశ్యగృహాలకు అమ్మేస్తున్నారు

Posted: 09/16/2016 01:51 PM IST
East godavari girls export to foreign brothel houses

ఏపీలో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. కేర్‌టేకర్ల ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను విదేశాలకు తరలించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదరికంలో ఉన్న అమ్మాయిలను ఆర్థిక ఉపాధి పేరుతో అక్కడి వేశ్యా గృహాలకు అమ్మేస్తున్న కీలక సభ్యుడిని పట్టుకున్న పోలీసులు, ఆపై మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం తాటికాయలవారి పాలేనికి చెందిన ఎస్.నాగసోమేశ్వరరావు, అలియాస్ బాబు(33) మధ్య తరగతి మహిళలకు డబ్బులు ఎరవేసి విదేశాల్లోని బ్రోతల్ హౌస్‌లకు వారిని ముఠా సభ్యులు విక్రయిస్తున్నాడు. ఇందుకోసం ఓ ముఠా ఏర్పాటు చేయగా, వారిని తరలించే క్రమంలో ఎయిర్ పోర్ట్ లో సమస్యలు ఎదురుకాకుండా అధికారులను సైతం విమానాశ్రయంలోని కిందిస్థాయి ఉద్యోగులను లోబర్చుకున్న ముఠాసభ్యులు తమకు ఆటంకాలు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

టూరిజం వీసాతో మహిళలను విదేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ కాలపరిమితి పూర్తయిన తర్వాత బాధిత మహిళలు స్వదేశం రాలేక అక్కడే ఉంటూ వేశ్యాగృహాల్లో మగ్గిపోతున్నారంట. ఈ కేసులో ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన పాండ్యరాజన్, రఫీ, ఫాతిమా, తూర్పుగోదావరికి చెందిన ఏసుప్రేమ అలియాస్ భీమవరం ఆంటీలను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : East Godavari  Girls  Brothel houses  Foreign  

Other Articles