లాలూ కొడుకుతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ | Lalu's Son Tej Yadav pic with Alleged Siwan Killer

Lalu s son tej yadav pic with alleged siwan killer

Lalu's Son Tej Yadav pic with Bunty, Siwan Killer Bunty with Lalu son, Lalu son relations with criminal, Lalu son satire to modi, Lalu's Son Tej Yadav pic with Alleged Siwan Killer, Tej Pratap Yadav pic with Bunty

Lalu's Son Tej Yadav pic with Alleged Siwan Killer.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో లాలూ కొడుకు క్లిక్

Posted: 09/15/2016 09:37 AM IST
Lalu s son tej yadav pic with alleged siwan killer

గూండారాజ్యం అని ముద్దుగా పిలుచుకుంటున్న బీహార్ లో సినిమాలో చూపించినట్లు నడిరోడ్డుపైనే మనుషులను క్రూరంగా దాడి చేసి చంపడం లాంటి సీన్లు తరచూ కనిపిస్తుంటాయి. లీడర్లు కూడా క్రిమినల్స్ తో కుమ్మక్కు అయిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అధికారంలో ఉన్న పార్టీ, పైగా మంత్రి పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో క్లోజ్ గా ఉంటే ప్రతిపక్షాలకు పండగే కదా!

సివాన్ ప్రాంతంలో 13 మే 2016లో జర్నలిస్టు రాజ్ దేవ్ రాజన్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటీ తప్పించుకుని తిరుగుతున్నాడు. సీబీఐ ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ కరడుగట్టిన నేరస్తుడితో మంత్రులు, నేతల పక్కనే తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. నిన్న మాజీ ఎంపీ, భాగల్ పూర్ జైలు నుంచి విడుదలైన షహబుద్దీన్ పక్కనే శనివారం నాడు కనిపించిన బంటీ, ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్ వెంట కనిపించడంతో, ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

అయితే, తన వెంట బంటీ ఉన్నాడన్న ఆరోపణలను తేజ్ కొట్టి పారేయడం గమనార్హం. "ప్రచారంలో ఉన్న ఫోటోలు, వీడియోల విషయమై నేనేమీ చేయలేదు. నా చుట్టూ వందలు, వేల మంది తిరుగుతుంటారు. నన్ను కలుస్తుంటారు. ఆరోపణలన్నీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సృష్టే" అన్నాడు. అదే సమయంలో 'సెక్స్ రాకెట్ నడిపినట్లు ఆరోపణలు వచ్చిన ఓ వ్యక్తి, ప్రధాని మోదీతో కలిసున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఒకరిపై వేలు చూపించే ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలి' అంటూ సెటైర్ కూడా వేశాడు.

ఏదేమైనా లాలూ అండ్ సన్స్  ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉన్న బీజేపీ తదితర విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Son  Tej Yadav  photo  Siwan Killer  

Other Articles