మూడు ముళ్ల బంధం పవిత్రను చాటిచెప్పేందుకు ఎందరో మహానుభావులు చేసిన ప్రయత్నాలు ఉన్మాదులుగా మారుతున్న మృగాళ్ల ముందు నిష్పలంగానే మారుతున్నాయి. అర్థాంగి అంటే మగవాడిలో సగమని, భర్తకు ఎలాంటి కష్టం వచ్చినా.. అమె చూసుకుంటుందని, నూరేళ్ల జీవితానికి అమె పరిణయ బంధంలోనే ప్రారంభిస్తుందని తెలిసికూడా అనేక మంది మృగాళ్లు వారిపై గృహహింసలకు పాల్పడుతున్నారు. అమ్మ చెప్పిందని, నాన్నకు కాఫీ ఇవ్వలేదనో, చెల్లిని పట్టించుకోలేదనో కారణాలతో అనేక మంది గృహిణులు ఇప్పటికీ మెట్టినింట అనేక కష్టాలు అనుభవిస్తున్నారు.
తమ ఆడపడచుకు ఇలాంటి ఘటనలు ఎదురైతే.. క్షణాల మీద తమ ఆడపడచు భర్తలపై విరుచుకుపడి.. నానా హంగామా చేసే మృగాళ్లు తాము చేస్తున్న దారుణాన్ని మాత్రం తేలికగా తీసుకుంటారు. మగాడు, మొగుడి అన్న అధికారం, అహంభావంతో విర్రవీగే భర్తలకు భార్యల విలువ తెలియక అలా చేస్తున్నారో.? లేక వారి నైజాన్ని ప్రశ్నించేవారెవరు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. భర్త చేతితో దారుణదాడికి, పరాభవానికి గురైన ఓ భర్యా మాత్రం అర్థాంతరంగా జీవితాన్ని చాలించింది. భర్తల పైశాచికత్వానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ ఘటనకు కేవలం చిన్న కారణమే కారణం.. ఐదు రూపాయల విద్యుత్.. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది.
వాటర్ హీటర్ ను ఎక్కువ సేపు వాడిందన్న చిన్న కారణాన్ని చూపిన ఓ హైదరాబాదీ భర్త తన భార్యను చితకబాదాడు. బాత్ రూంలో స్నాం చేస్తున్న భార్యను వివస్త్రగానే బయటకు లాక్కుని వచ్చిన ఆ భర్త చేసిన దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సైదాబాదులో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకెళితే... సైదాబాదుకు చెందిన మోహన్ తో నల్లగొండ జిల్లాకు చెందిన సుశృతకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మోహన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సుశృత గృహిణిగా ఉంటోంది.
ఈ క్రమంలో నిన్న ఉదయం స్నానం చేసేందుకు వేడి నీళ్లు పెట్టుకున్న సుశృత వాటర్ హీటర్ కాస్తంత ఎక్కువ సేపు ఆన్ లో ఉంచింది. ఆ తర్వాత ఆమె స్నానానికి వెళ్లగా.. విషయం గ్రహించిన మోహన్... సుశృత స్నానం ముగియకముందే బాతఠ్ రూంలోకి చొరబడ్డాడు. హీటర్ ను ఎక్కువసేపు ఎందుకు వాడావంటూ ఆమెపై అక్కడే చేయి చేసుకున్నాడు. పొరపాటైందని సుశృత వేడుకున్నా వినని మోహన్ ఆమెను వివస్త్రగానే బయటకు లాక్కొచ్చాడు. అత్తామామ, ఆడబిడ్డ, పిల్లల ముందుకు తనను వివస్త్రగా లాక్కొచ్చిన వైనంపై సుశృత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన గదిలోకి వెళ్లిపోయిన సుశృత... తనకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు వివరిస్తూ వాట్సప్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశృత వాట్సాప్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
"మళ్లీ బావ కొట్టిండు. నేను ఏమీ అనలేదు. హీటర్ కాసేపు ఎక్కువ పెట్టినా అని అన్నాడు. అప్పటికీ చూసుకోలేదు, తప్పయింది అన్నాను. అయినా బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే వచ్చి కొట్టిండు. బయటకు వచ్చాక బట్టలు కూడా వేసుకోనీయలే. వాళ్ల అమ్మ ఉంది కూడా. తోడికోడలు, వాళ్ల పిల్లలు చూస్తుండగానే బట్టలు లేకుంటే కొట్టాడు. మా మామయ్య పైకి వచ్చి ఆయననే సపోర్ట్ చేస్తుండు. ఏ ... కొడుకు వస్తాడో రానీ వాని సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు"
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more