ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులే కీలకం | telangana CID key evidences in EAMCET paper leak

Telangana cid key evidences in eamcet paper leak

telangana CID, vijayawada coaching centre, eamcet leak, 30 students involved in eamcet scam

Telangana CID key evidences in eamcet leak scam.

ITEMVIDEOS:ఎంసెట్ లీక్ స్కాం కీలక సాక్ష్యాలు లభ్యం

Posted: 07/27/2016 03:48 PM IST
Telangana cid key evidences in eamcet paper leak

ఇంటర్ లో నాలుగు సార్లు ఫెయిల్ అయితేనేం ఎంసెట్ లో వందలోపు ర్యాంకులు. ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ర్యాంకర్ల బాగోతం. ప్రశ్నాపత్నం అయినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని సీఐడీ అధికారులు బుధవారం అధికారిక ప్రకటన వెలువరించారు.

విజయవాడకు 7 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో అపార్ట్ మెంట్ లో కోచింగ్ సెంటర్ నిర్వహించి మరీ లీకేజీకి పాల్పడ్డారు. లీక్ తో 30 మంది వరకూ విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని, ఇప్పటివరకూ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. పరీక్ష జరిగే సమయానికి రెండు రోజుల ముందు వీరికి ప్రశ్నాపత్రాన్ని నిందితులు ఇచ్చారని నిర్ధారించారు. విద్యార్థులను ముంబై, బెంగళూరు ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ముందుగానే ప్రిపేర్ చేయించి, పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్లకు చేర్చారని, ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థికి 50 లక్షల చోప్పున మొత్తం 15 కోట్ల స్కాం జరిగిందని నిర్ధారణ అయ్యింది. భూపాల్ పల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులే వీరిలో అధికంగా ఉన్నారు. ఇందులో ఆరోఫనలు ఎదుర్కుంటున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Eamcet  paper leak  CID  

Other Articles