అదనపు కట్నం అనే రోగంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి భార్యతోసహా మామను పొట్టనబెట్టుకున్నాడు. చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది.
గ్రామానికి చెందిన సబ్రహ్మణ్యం అనే వ్యక్తి భార్య విజయను అదనపు కట్నం కోసం మూడేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. వారిద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం పోలీసులు వదిలేశారు. ఆ కోపంతో మృగంలా మారిన అతను గత రాత్రి కత్తిచేతబట్టి భార్య సహా మామ, అత్త, బావమరిదిపై దాడికి దిగాడు.
భార్య విజయతో పాటు మామ వెంకటేశ్వరరావులను నరికేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.ఈ దాడిని అడ్డుకోబోయిన తన బావమరిది శివరామకృష్ణ, అత్తపైనా సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. శివరామకృష్ణకు తీవ్ర గాయాలు కాగా అతడి తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
దాడి అనంతరం సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆపేందుకు యత్నించిన బంధువు వెంకటేశ్వరరావుపైనా అతడు దాడికి దిగాడు. ఈ దాడిలో వెంకటేశ్వరరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించిన పొరుగు గ్రామం పర్వతపురం గ్రామస్తులు ఎట్టకేలకు అతడిని నిలువరించి పోలీసులకు పట్టించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more