అందుకే స్వాతిని చంపా... | Ramkumar explained why he kill swathi

Ramkumar explained why he kill swathi

techie swathi murderer Ramkumar, ramkuumar statement in swathi case, swathi murder case, why ram kumar kill swathi

Ramkumar explained why he kill Infosys techie swathi.

అందుకే స్వాతిని చంపా...

Posted: 07/15/2016 10:21 AM IST
Ramkumar explained why he kill swathi

టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ ఎట్టకేలకు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రేమించి మోసం చేసిందనందుకే చంపానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్వాతితో తనకు పరిచయం ఎలా ఏర్పడిందీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చివరకు ఎలా హత్య చేశాడో మొత్తం వివరాలను పోలీసులకు విచారణలో వెల్లడించాడు...

బీఈ ఫెయిలైన తాను సంపాదన కోసం చెన్నై వచ్చాననీ, ఆ సమయంలో సూర్యప్రకాశ్ అనే స్నేహితుడి ద్వారా స్వాతితో పరిచయమేర్పడిందని చెప్పాడు. స్వాతి తనతో చాలాక్లోజ్‌గా ఉండేదనీ, రోజుల తరబడి ఆమెతో ఫోన్ లో మాట్లాడనని, ఆమెను గాఢంగా ప్రేమించానని తెలిపాడు. తాను ప్రైవేట్‌ సంస్థలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా నెలకు లక్షరూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపానని, ఆ తర్వాత స్వాతి తనతో సెల్‌ఫోన్‌లో మాట్లాడేదనీ, ఆమెకోసమే తాను చూళైమేడు మేన్షన్‌లో అద్దెకు దిగానని చెప్పాడు. చూళైమేడులోని గుడికి తామిద్దరం కలిసి చాలాసార్లు వెళ్లామని, ఆ తర్వాత తాను బట్టల దుకాణంలో చేరి సంపాదించిన జీతంతో పాటు ఊరి నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బుని స్వాతి కోసమే ఖర్చు చేశానని వివరించాడు.

తన బట్టల దుకాణంలోని కొత్త డిజైన్ బట్టలు వేసుకుని వెళ్తుండంతో ఆమె తనను ఓ ధనవంతుడి బిడ్డగా భావించిందనీ, అప్పటి వరకూ సాఫీగా కొనసాగిన తమ స్నేహంలో ఓ రోజు స్వాతి తాను బట్టల దుకాణంలో పని చేస్తుండగా చూడటంతో మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత ఆమె తనను దుర్భాలాషలాడిందనీ, సాఫ్ట్‌వేర్‌ఇంజనీర్‌ అనీ, లక్ష రూపాయల జీతమని తనతో ఎందుకు అబద్ధాలు చెప్పావంటూ కోపగించుకుందని రామ్‌కుమార్‌ పోలీసుల విచారణలో తెలిపాడు.చివరకు తనతో మాట్లాడటం మానివేసిందనీ, అప్పటి నుంచి ఆమెపై తాను కక్ష పెంచుకుని, తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతోనే ఆమెకు సరైన గుణపాఠం నేర్పానని రామ్‌కుమార్‌ తెలిపాడు.

గురువారం స్వాతి స్నేహితుడైన ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన బిలాల్‌ మాలిక్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. నుంగంబాక్కం పోలీసుస్టేషన్‌కు బైకులో వెళ్లిన బిలాల్‌ మాలిక్‌ పరిసరాల్లో మీడియా హడావుడి చూసి హెల్మెట్‌ తోనే స్టేషన్‌లోపలకు వెళ్లిపోయాడు. తనను ఓ యువకుడు తరచూ వెంబడిస్తున్నాడంటూ స్వాతి తనకు పలుమార్లు తెలిపిందని స్వాతితో పాటు పనిచేసిన మాలిక్‌ హత్య జరిగిన వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి వాంగ్మూలమిచ్చాడు. ప్రస్తుతం తమ కస్టడీలోకి తీసుకున్న రామ్‌కుమార్‌ వద్ద జరుపుతున్న విచారణలో భాగంగానే పోలీసులు మాలిక్‌ను పిలిపించారని తెలుస్తోంది. స్వాతి తనను వెంబడించిన యువకుడి రూపు రేఖలేవైనా మాలిక్‌కు చెప్పిందా అని పోలీసులు ప్రశ్నించారనీ, స్వాతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం రామ్‌కుమార్‌ ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే పోలీసులు అతడిని రప్పించారని చెబుతున్నారు. 

ఎగ్మూరు కోర్టు ఆదేశాల మేరకు రామ్‌కుమార్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న నుంగంబాక్కం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ జరుపుతున్నారు.ఇప్పటిదాకా మధ్యవర్తి అయిన సూర్యప్రకాశ్ గురించి ఆచూకీ కనిపెట్టకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : techie swathi  Ramkumar  statement  

Other Articles