పేస్ బుక్ స్వాతి ప్రాణాలు తీసింది | Facebook chating reason for techie swathi murder

Facebook chating reason for techie swathi murder

Ram Killed Why Killed Swathi, Swathi Ram kumar Facebook Chat, Facebook chating reason for swathi murder

Facebook chating reason for techie swathi murder.

టెక్కీ స్వాతి ఫేస్ బుక్ ప్రేమాయణం?

Posted: 07/05/2016 03:56 PM IST
Facebook chating reason for techie swathi murder

చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. హత్య చేసింది నేనే అని, దానికి గల కారణాలను పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పుకోచ్చాడు ప్రేమోన్మాది రామ్ కుమార్. అసలు ఆమె కోసమే తాను చెన్నై వచ్చానని, అలాంటిది తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోకలేకపోయానని చెప్పాడు. అంతేకాదు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అసలు ఏ మాత్రం సంబంధం లేని వీరిని ఒక్కటి చేసింది సోషల్ మీడియానేనట. కేవలం ఫేస్ బుక్ పరిచయంతోనే ప్రేమించి స్వాతి ప్రాణాలు తీశానని చెబుతున్నాడు.

అపరిచితులతో చాటింగ్ ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నేటి యువత మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఎన్ని జరిగినా తమ జాగ్రత్తలో తాము ఉంటామంటూనే ఆ ఉచ్చులో పడి నలిగిపోయే ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చేరి స్వాతి ఫేస్ బుక్ తో చిదిమిపోయింది. ఫేస్ బుక్ లో గంటలు గంటలు చాటింగ్ చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసమని ఇంట్లో చెప్పి ఏకంగా ఆమె ఇంటి దగ్గర్లోనే మకాం పెట్టాడు రామ్ కుమార్. నిత్యం ఆపీస్ కు వెళ్లే స్వాతిని ఫాలో అవుతూ, ఓ రోజు సమీపంలోని గుడికి వెళ్లిన ఆమెను కలుసుకునే ప్రయత్నం చేశాడు. స్వాతి అతన్ని గుర్తించి నవ్వటంతో ప్రేమిస్తుందని పొంగిపోయాడు.

ఆపై తన మనసులోని మాట చెప్పటంతో ఆమె తిరస్కరించడం, కొండముచ్చని గేలిచేయటం, అది మనసులో పెట్టుకుని కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెను కిరాతకంగా కడతేర్చడం, చుట్టూ జనాలు ఉన్నా ఎవరూ ఆమెకు కనీస సాయం చేయకపోవటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఫేస్ బుక్ లో చాటింగ్ చేయటం మాట అటుంచి పలకరిస్తే పోయేదేముందనుకోవటమే ఆ యువతి చేసిన తప్పా? లేక కాస్త చనువు ఇచ్చిందని అదే ప్రేమనుకుని వెంటపడి వేధించిన రామ్ కుమార్ దా?

ఇక రామ్ కుమార్ కు స్వాతి నేరుగా ఫేస్ బుక్ లో పరిచయం కాలేదు. మధ్యలో సూర్య ప్రకాశ్ అనే మరో యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంతవరకు అతడిని పట్టుకోకపోవటంపై పలు అనుమానాలకు తావు ఇస్తోంది. మరోవైపు హత్య జరిగిన రోజు రైల్వే స్టేషన్లో మరో యువకుడిని చెంపపై కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అది సూర్య ప్రకాశేనా? లేక మరో వ్యక్తా? ఈ నేరంలో అతడి భాగం ఎంత మేర ఉంది తదితర విషయాలను ఇంతవరకు బయటపెట్టలేకపోయారు. కానీ, ఈ కేసును లోతుగా పరిశీలిస్తే వెలికిరాని విషయాలు ఎన్నో ఉన్నాయన్నది స్పష్టమౌతుంది. ఏం జరిగిందో చెప్పడానికి స్వాతి లేదు, రామ్ కుమార్ చెబుతున్నది నిజం అనడానికి గ్యారెంటీ లేదు. కనిపించకుండా పోయిన ఆ మూడో వ్యక్తి దొరికితేనే అసలు నిజం వెలుగుచూసే అవకాశం ఉంది. అయితే ఇందులో తప్పేవరిదో చెప్పటం కష్టమయినప్పటికీ అకారణంగా ఓ యువతి జీవితం బలైపోయిందన్నది మాత్రం వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Infosys  swathi murder  Ram Kumar  Facebook Chat  

Other Articles