ఊపిరి ఉన్నంత కాలం జాతి కోసం పోరాటం | Kapu leader Mudragada ends hunger strike

Kapu leader mudragada ends hunger strike

Kapu leader Mudragada Padmanabham, Mudragada ends hunger strike, mudragada Kirlampudi, latest news, AP politics, Mudragada ends hunger strike, latest news, telugu news, ముద్రగడ దీక్ష విరమణ, ముద్రగడ కిర్లంపూడి, తాజా వార్తలు, తెలుగు వార్తలు, రాజకీయాలు, ముద్రగడ దీక్ష, కాపు నేత దీక్ష, కాపు నేత దీక్ష విరమణ, mudragada news, telugu news, latest news, AP politics

Kapu leader Mudragada padmanabham ends hunger strike. It is knowing that Mudragada continuing his indefinite hunger strike for 14 days for tuni releases.

ITEMVIDEOS: ఊపిరి ఉన్నంత కాలం జాతి కోసం పోరాటం

Posted: 06/22/2016 01:30 PM IST
Kapu leader mudragada ends hunger strike

కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం దీక్ష విరమించారు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 14 రోజులుగా ఆయన చేస్తున్న దీక్షను ఎట్టకేలకు ముగింపు పలికారు. ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం చేరుకున్న ఆయనచేత కాపు సంఘాల నేతలు దీక్ష విరమింపజేశారు.

ఈ సంద‌ర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ‘ఊపిరి ఉన్నంత వ‌ర‌కు నా జాతి కోసం పోరాడ‌తా’న‌ని అన్నారు. ‘ఎన్ని అవ‌మానాల‌యినా భ‌ర్తిస్తాను.. ఇచ్చిన హామీని నెర‌వేర్చండి. హ‌మీల‌ను అమ‌లు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి చల్లని కబురు వచ్చే వ‌ర‌కు నేను ఏ పండుగ చేసుకోనూ’ అంటూ ప్రకటించారు. తన కుటుంబ సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల ఆయన కంటతడి పెట్టుకున్నారు.
కొడుకుపై లాఠీఛార్జీ చేస్తూ బూతులు తిట్టారని ముద్రగడ ఆరోపించారు. ఎటువంటి ప్రతీకార చర్యలకు దిగబోమని, న్యాయంగా పోరాడతామని తెలిపారు.

తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేయడంతోపాటు అమాయకపు వ్యక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ఆమరణ దీక్షకు దిగారు. ఆపై ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలోనూ దీక్ష విరమణకు ససేమిరా అన్న ముద్రగడ.. అరెస్టైన కాపులంతా బెయిల్ పై విడుదల కావడంతో నేటి ఉదయం దీక్ష విరమించారు.

భాస్కర్
   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu leader Mudragada  Mudragada Padmanabham  hunger strike  kirlampudi  

Other Articles