తండ్రి పీఎం కాకుండా లోకేష్ అడ్డు పుల్లవేశాడా? | chandra babu sacrifice PM post for lokesh

Chandra babu sacrifice pm post for lokesh

AP CM chandrababu naidu, primeminister candidatem united front, ఏపీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, ప్రధాని అభ్యర్థి, నారా లోకేష్, జ్యోతిబసు, latest news, political news

In the 1990s when Jyoti Basu and other third front leaders wanted him to take over as Prime Minister, his son Nara Lokesh told him, “Father, that would be a temporary job”.Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu shared this anecdote on Saturday night with a group of journalists here on the sidelines of the three-day ‘Mahanadu’ (convention) of the Telugu Desam Party (TDP).

తండ్రి పీఎం కాకుండా లోకేష్ అడ్డు పుల్లవేశాడా?

Posted: 05/30/2016 09:32 AM IST
Chandra babu sacrifice pm post for lokesh

ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అప్పట్లోనే మంచి అవకాశం వచ్చింది. కీలక నేతల మద్ధతు కూడగట్టినప్పటికీ, ఎందుకనో ఆ అంశంలో బాబు అనాసక్తి ప్రదర్శించడంతో పదవి చేజారిపోయింది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జాతీయ పార్టీ నేత హోదాలో హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆయన ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తనయుడు నారా లోకేష్‌కు రాష్ట్ర రాజకీయాలను అప్పగించడానికి వ్యూహరచనలో భాగంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో  ‘మహానాడు’ వేదికగా జాతీయ మీడియాతో శనివార ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు ఎప్పటి నుంచో ఆసక్తి అని, త్వరలో అవి జరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయంటూ  ముందస్తు సూచనలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అప్పట్లో జరిగిన ఓ అంశాన్ని ప్రస్తావించారు. 1990లో తనకు అందివచ్చిన ప్రధానమంత్రి పదవిని తన కొడుకు నారా లోకేశ్ వద్దనడంతో వదిలేశానని ఆయన చెప్పారు. ‘‘యునైటెడ్ ఫ్రంట్ కు అధికారం దక్కడంలో 1996లో మేం కీలక పాత్ర పోషించాం. ఈ క్రమంలో ప్రధాని పదవి చేపట్టాలంటూ పలువురు ప్రముఖ నేతలు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను విముఖత చూపా. అయితే జ్యోతిబసు తదితరులు మరోమారు నాకు పీఎం పోస్టును ఆఫర్ చేశారు. అప్పుడు లోకేష్ తొమ్మిదో లేక పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసులోనే ప్రధాని పదవి చేపట్టవద్దంటూ నన్ను ఆపాడు. ప్రధాని పదవి తాత్కాలికమేనని నన్ను హెచ్చరించాడు. దీంతో చేతికి అందిన ప్రధాని పదవిని వదిలేశా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థ ప్రముఖంగా ప్రచురించగా, వెలుగులోకి వచ్చింది. అప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని వదలుకోవడానికి, ఇప్పుడు బ్యాక్ నేషనల్ పొలిటిక్స్ అనడానికి రెండిటీ వెనకాల లోకేషే ఉన్నాడన్నమాట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  PM candidatem  nara lokesh  united front  jyothi basu  

Other Articles