ఒబామా కామెడీ షో | Obama comedy show

Obama comedy show

Barack Obama, Obama, Obama Comedy, Obama Jokes, Obama dinner, ఒబామా, బరాక్ ఒబామా

Barack Obama comedy show with special gurests. Obama gave dinner party in White House.

ITEMVIDEOS: ఒబామా కామెడీ షో

Posted: 05/02/2016 07:47 AM IST
Obama comedy show

అమెరికా అధ్యక్షుడు అంటే అదో హోదా.. అదో గౌరవం.. అదో రాయల్టీ. కానీ ప్రస్తుత అధ్యక్షుడు, త్వరలోనే అధ్యక్ష స్థానాన్ని వీడనున్న బరాక్ ఒబామా విషయంలో మాత్రం ఇవన్నీ కాస్త పక్కన బెట్టాలి. ఆయన మాట తీరు దగ్గరి నుండి అన్నింటా డిఫరెంట్ గా ఉంటారు. తాజాగా ఆయన నిర్వహించిన ఓ పార్టీలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన విందులో నవ్వుల పువ్వులు పూయించారు. విందులో ఆయన మైక్‌ను జార విడిచి ఒబామా నీ పనైపోయింది అని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్ల నుంచి రిపబ్లికన్ల వరకు, మీడియా నుంచి తన తదుపరి అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలున్న హిల్లరీ, ట్రంప్‌లపై కూడా ఆయన సెటైర్లు వేశారు.

డొనాల్డ్ ట్రంప్‌పై పదునైన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్షుడయ్యేందుకు విదేశాంగ విధానంలో అనుభవం లేదని అనడం తప్పని అన్నారు. ఆయన మిస్ స్వీడన్, మిస్ ఆర్జెంటీనా, మిస్ అజర్‌బైజాన్ లాంటి విదేశీ విఐపీలతొ గడిపిన అనుభవం బాగా ఉందని అన్నారు. ఇక హిల్లరీ క్లింటన్ యువ ఓటర్ల మద్దతు కోరుతున్న తీరును ఒబామా ఎద్దేవా చేశారు. ఆమెను హిల్లరీ అత్త అని సంబోధించిన ఒబామా కొత్తగా ఫేస్‌బుక్ ఖాతా ప్రారంభించిన మీ బంధువు.. అందులో ఏదైనా పోస్ట్‌చేసి.. నేను ఫేస్‌బుక్‌ను సరిగ్గానే ఉపయోగిస్తున్నానా అని ప్రశ్నించినట్లుగా ఉంది హిల్లరీ ప్రచారం అంటూ ఎగతాళి చేశారు. జర్నలిస్టులపై కూడా జోకులు వేశారు. తనకు సహకరించిన అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles