To protest against PWD officials’ apathy, Buldhana locals perform ‘Nagin dance’

Telugu content

nagin Dance, PWD, Maharastra, Buldhana, Chhatrapati Shivaji Market, నాగిన్ డ్యాన్స్, పబ్లిక్ వర్క్స్

If you thought you have seen it all when it comes to staging a protest, think again.In a bizarre case, Maharashtra Baldhana's locals performed 'Nagin dance' to protest against the PWD officials' apathy.The men were protesting the poor condition of roads near Chhatrapati Shivaji Market, and were angry with PWD for inaction despite several complaints

ITEMVIDEOS: అధికారుల ముందు వాళ్ల నాగిన్ డ్యాన్స్

Posted: 04/30/2016 01:06 PM IST
Telugu content

గవర్నమెంట్ ఆఫీసుల్లో మన పనులు ఆపీసర్లు ఎంత బాగా చేస్తారో అందరికి తెలుసు. పనుల కోసం వచ్చే జనం చెప్పులరిగేలా తిరిగినా పని మాత్రం జరగదు. కాని ఇప్పుడు కాలం మారింది పని చెయ్యలేదంటే నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. ఇక చేతిలోకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత  తమ నిరసనను కాసింత భిన్నంగా ఆలోచించాలంతే.. వినూత్న నిరసన తెలపండి.. వీడియో తీసి అప్ లోడ్ చేయండి. అది ఊహించని స్థాయిలో సంచలనం అవుతుంది. తిప్పించిన అధికారి ముక్కు నేలకురాసి పని చేసేస్తారు. ఎలా చేయాలో మచ్చుకు ఓ ఉదాహరణ కావాలంటే మహారాష్ట్రకు చెందిన ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే..

మహారాష్ట్రలోని బుల్దానాలో స్థానికులు అధికారులపై వింత నిరసనకు దిగారు. ప్రజా పనుల శాఖ(పబ్లిక్ వర్క్స్) కార్యాలయంలో అధికారుల ముందు నాగినీ డ్యాన్స్ చేశారు. వారు ఇది ఇబ్బందిగా ఫీలై పోలీసులను పిలిచి బయటకు పంపించే యత్నం చేశారు. అయినా వారు మానలేదు. తమ ప్రాంతంలో పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారులను మేల్కొల్పేందుకే ఈ అస్త్రం ప్రయోగించామని స్థానికులు తెలిపారు. అధికారుల్లో మార్పు రాకుంటే తమ నాగినీ డ్యాన్స్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles