PM Modi targets Opposition, NGOs: Conspiracies daily to finish me

Conspiracies being hatched to destabilise government defame me says pm modi

modi, pm modi, chai wala modi, modi chai wala, odisha, modi in odisha, PM Narendra Modi,Modi government,Modi in Odisha

Prime Minister Narendra Modi on Sunday alleged that disgruntled NGOs and black-marketeers were conspiring to destabilise the government and "defame" him and asserted that he will not bow to any machinations.

కేంద్రాన్ని అస్థిరపర్చేందుకు ప్రతిపక్షాల కుట్రంటూ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Posted: 02/22/2016 10:34 AM IST
Conspiracies being hatched to destabilise government defame me says pm modi

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు పలు ఎన్జీవో సంస్థలు నిత్యం కుట్ర పన్నుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. , తన పరువు, ప్రతిష్ఠలను దిగజార్చేందుకు కొందరు అనుక్షణం ప్రయత్నిస్తున్నారని ఆయన అరోపించారు. ఒడిశాలోని బరగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన విఫక్షాలను తూర్పరబడుతూ వ్యాఖ్యానించారు. అయితే తన ప్రభుత్వం వారి ఆటలు సాగనీయకుండా కఠినంగా వ్యవహరించడంతో చేసిది లేక అవి తనపై బురద జల్లుతున్నాయని కూడా ఆరోపించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోను అభివృద్ధి పథాన్ని వీడబోనని, వీరి ఆరోపణలకు భయపడేది లేదని అన్నారు.

భారత్ లాంటి ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి  ఓ చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారన్న నిజాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ మధ్యకాలంలో తనపై జరుగుతున్న కుట్ర, ఆరోపణల వర్షం కురిపించడం తదితరాలను ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. దేశాన్ని దోచుకోవడానికి అవకాశం లభించడం లేదన్న బాధతోనే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఆరేళ్లలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని, స్టార్టప్ పరిశ్రమలు వ్యవసాయం అభివృద్ధికి ఉపయోగపడతాయని అన్నారు. కాగా, నేడు మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  pm modi  chai wala modi  modi chai wala  odisha  modi in odisha  

Other Articles