Lady Falls Into Agnigundam

Lady falls into agnigundam

nalgonda, Jadala Ramalingeswara Swamy Brahmotsavam, Agnigundam

Of Jadala Ramalingeswara Swamy Brahmotsavam. Police respond ontime. They ddragged her from fire

ITEMVIDEOS: నల్గొండ చెర్వుగట్టు జాతర్లో అపశృతి.. అగ్నిగుండంలోపడ్డ మహిళ

Posted: 02/17/2016 11:27 AM IST
Lady falls into agnigundam

నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జాతర ఓం నమఃశివాయ అన్న భక్తుల నామస్మరణలతో పులకరించిపోయిన చెర్వుగట్టు క్షేత్రంలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన భక్తజనంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శివసత్తులు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు నడుమ జరిగిన అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు ఎర్రటి నిప్పులపై నడిచారు. అగ్నిగుండం కార్యక్రమంలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఓ మహిళ గాయపడింది. చెరువుగట్టు జాతర సందర్భంగా జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసే అగ్నిగుండంలో నడిస్తే పాపాలు తొలగిపోతాయని మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఈ నేపథ్యంలోనే ఇక్కడి నిప్పుల కొలిమిలో నడిచేందుకు భక్తులు పోటీ పడతారు. ఇలా ఓ మహిళ నిప్పులపై నడుస్తుండగా వెనుక ఉన్న భక్తులు ఆమెను తోసుకుంటూ ముందుకు పరిగెత్తారు. దాంతో పట్టు తప్పిన ఆ మహిళ అగ్నిగుండంలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను బయటకు లాగేశారు. ఈ ఘటనలో భక్తురాలు గాయాలపాలవడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalgonda  Jadala Ramalingeswara Swamy Brahmotsavam  Agnigundam  

Other Articles