Thirteen students died in Murud breach at Maharastra

Thirteen students died in murud breach at maharastra

Maharastra, Pune, Students, Beach, 13 Students died, annual excursion, Abeda Inamdar Senior College, Murud breach, Raigad district

Thirteen students from Pune’s Abeda Inamdar Senior College, who had gone for a picnic to Murud breach in Raigad district, drowned on Monday. The dead include 10 girls and three boys. All of them were aged between 18 and 20 and were studying Computer Science. The group, comprising 112 students, eight teachers and three non-teaching staff, left the college in three buses at 7 am for their annual excursion.

బీచ్ లో స్నానానికి వెళ్లి 13 మంది మృతి

Posted: 02/02/2016 12:49 PM IST
Thirteen students died in murud breach at maharastra

మహారాష్ట్రలో తాజాగా సముద్ర స్నానానికి వెళ్లి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అప్పటివరకూ జాలీగా సాగిన విహారయాత్రను విషాద యాత్రగా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని మురుద్ బీచ్ లో జరిగింది. పుణెలోని అబేడా ఇనామ్ దార్ కాలేజీ నుంచి 130 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కాలేజీ టూర్ లో భాగంగా హాలిడే స్పాట్ మురుద్ బీచ్ వెళ్లారు. వారిలో 18 మంది అరేబియా సముద్రంలో స్నానానికి దిగారు. కాసేపటికే అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. తప్పుకుని తీరానికి చేరుకుందామనుకునేలోపే క్షణాల్లో వారిని లోపలికి లాగేసింది.

వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లు ఐదుగురిని కాపాడగలిగాయి. కానీ మిగతావారంతా నీళ్లలో మునిగి మృతి చెందారు. దాదాపు రెండు గంటల గాలింపు తర్వాత వారి మృతదేహాలు లభించాయి. మృతుల్లో 10 మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంకా పది లేదా పన్నెండు మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉందంటున్నారు అధికారులు.

విద్యార్థులందరూ బీఎస్సీ, బీసీఏ ఫస్ట్, సెకండ్, ఫైనలియర్ విద్యార్థులు. ఈ ఘటనతో పుణెలోని ఇనామ్ దార్ కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలిసి కాలేజీ చేరుకున్న తల్లిదండ్రులంతా.. చెట్టంత ఎదిగిన తమ పిల్లలు ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గుండెలవిసేలా రోదించారు. చనిపోయిన విద్యార్థులంతా పుణెకు చెందిన వాళ్లే. వీరి వెంట ఐదుగురు సిబ్బంది, ఇతర సహాయకులు కూడా ఉన్నారు. కానీ విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్తున్నప్పుడు వారిని అప్రమత్తం చేయలేదు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. లైఫ్ జాకెట్లు లేకుండానే సముద్రంలోకి వెళ్లడం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని లైఫ్ గార్డ్స్ చెబుతుంటే.. బీచ్ లో భారీ అలలు వస్తాయని కనీసె హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదని విద్యార్థులు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles