After 400 years, Garhwal temple allows entry to Dalits, women

Allowing women and dalit temple sheds 400 year old tradition

Allowing Women, Temple Sheds 400-year-old Tradition, dehradun, Parsuram temple, Garhwal, Jaunsar Bawar, kerala, sabarimala, ayyappa, dalits, Parsuram temple committee, Dalit, Women,

The Parsuram temple in Garhwal's Jaunsar Bawar region has decided to get rid of its 400-year-old tradition and allow the entry of women and Dalits inside the famous temple.

400 ఏళ్ల తరువాత.. చారిత్రాత్మక ఆలయ కమిటీ సంచలన నిర్ణయం

Posted: 01/17/2016 02:43 PM IST
Allowing women and dalit temple sheds 400 year old tradition

దైవం ముందు అందరూ సమానులే అన్న వాదనను డెహ్రాడూన్లోని ఓ ప్రసిద్ధ ఆలయం సమర్థించింది. ఈ మేరకు చరిత్రక దేవాలయం ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు నాలుగు వందల ఏళ్లనాటి దురాచారానికి చరమగీతం పాడింది. ఇన్నాళ్లుగా దేవాలయల్లో తాము ఎప్పుడెప్పుడు అడుగుపెడతామా అని ఎదురు చూసిన దళితులు, మహిళలకు శుభవార్తను అందించింది. ఈ చారిత్రాత్మక దేవాళయంలోకి ఇకపై మహిళలు, దళితుల ప్రవేశాన్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం జౌన్సర్ బవర్ ఏరియాలోని పరుశురాం దేవాలయ ఆలయ కమిటీ భేటీ అనంతరం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ ఆలయంలోకి అడుగు పెట్టొచ్చని తీర్మానించారు. భవిష్యత్తులో ఆలయ ప్రవేశానికి అందరికి అనుమతి ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటుగా దేవాలయ ఆవరణలో జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాము గత 13 ఏళ్ల నుంచి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని దళిత నాయకుడు దౌలత్ కున్వర్ చెప్పారు. పరశురామ్ ఆలయం నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చాలా ప్రగతిశీలమైందన్నారు. దేవాలయ అధికారులు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఇతర దేవాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

మారుతున్న ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా అవసరమని కమిటీ చైర్మన్ జవహర్ సింగ్ చౌహాన్ చెప్పారు. తమ ప్రాంతంలో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిందన్నారు. ఫలితంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. పురోగతి మార్గంలో పయనిస్తున్నారని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ మార్పును ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.కాగా కేరళ లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల నిషేధంపై వివాదం కొనసాగుతుంటే మరోవైపు ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ ఆలయం దేవాలయ పరిపాలనా అధికారులు నిర్ణయాన్ని పలువురు దళిత మేధావులు ప్రశంసించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parsuram temple  temple committee  Dalit  Women  

Other Articles