father is a chaiwala and daugher is a judge in same court

Father is a chaiwala and daugher is a judge in same court

Court, Punjab, the sub-divisional magistrate in Nakodar, Nakodar, Jalandhar, Surinder Kumar, Shruti

Surinder Kumar has worked as a tea seller all his life. As an owner of a tea shop right across the court, Surinder has been serving people tea at the complex of the sub-divisional magistrate in Nakodar (Jalandhar district), for years. But little did he know that one day his daughter would walk through the doors of the same court as a judge

ఓ కోర్టు.. బయట టీ అమ్మే తండ్రి.. జడ్జిగా కూతురు

Posted: 12/31/2015 08:55 AM IST
Father is a chaiwala and daugher is a judge in same court

ఉన్నోడైనా.. ఏమీ లేనోడైనా కానీ తన పిల్లలు బాగుపడాలి.. తనను మించిన వాళ్లు కావాలని కోరుకుంటారు. అలా తమ పిల్లలు మంచి పొజిషన్ లో ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు ఉండదు. అయితే ఇలాంటి ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కోర్టు... ఆ కోర్టు ఆవరణలో ఓ తండ్రి టీ అమ్ముతుంటే.. కోర్టు లోపల తీర్పులు చెబుతూ జడ్జిగా ఆ టీ అమ్మే అతడి కూతురు పని చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ రియల్ లైఫ్ స్టోరీ మీ కోసం..

పంజాబ్ లోని జలంధర్ జిల్లాలోని నకోదర్ సబ్ డివిజినల్ కోర్టు ప్రాంగణంలో సురీందర్ కుమార్ టీ అమ్ముకుంటారు. అక్కడికి వచ్చే న్యాయవాదులు, న్యాయమూర్తులకు, వాజ్యాల పరిష్కారానికి వచ్చే వారికి సురేందర్ కుమార్ టీ సరఫరా చేస్తుంటారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ, కుమార్తెను చదివించారు. కళాశాల విద్య పూర్తి చేసిన సురేందర్ కుమార్ కుమార్తె శృతి పంజాబ్ యూనివర్సిటీలో లాను పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే పంజాబ్ సివిల్ సర్వీసెస్ (జ్యుడీషియల్ విభాగం) లో విజయం సాధించింది. ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న శృతి, తన తండ్రి ఏ కోర్టులో అయితే టీ అమ్ముతూ తనను చదివించారో అదే న్యాయస్థానంలో జడ్జిగా నియమితురాలైంది. దీంతో ఇంతవరకు టీ అమ్మే వ్యక్తిగా గుర్తింపు పొందిన సురేందర్ కుమార్, ఇప్పుడు జడ్జి శృతి తండ్రిగా గర్వపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court  Punjab  the sub-divisional magistrate in Nakodar  Nakodar  Jalandhar  Surinder Kumar  Shruti  

Other Articles