Mob attacks on Police in Gujarat

Mob attacks on police in gujarat

Gujarat, Police, Vadodara, Attack on Police, Vadodara police attacked by public, Mob attack on Police

In a shocking incident, n agitated mob assaulted policemen at Vadodara, Gujarat, on 29 December. The incident occurred after a head constable of the traffic department allegedly hit a motorcyclist who was riding pillion, with two others.

ITEMVIDEOS: పోలీసులను చితకబాదిన ప్రజలు

Posted: 12/30/2015 01:05 PM IST
Mob attacks on police in gujarat

జనాలకు తిక్కరేగితే మామూలుగా ఉంటుందా... అది రౌడీ అయినా చివరకు పోలీస్ అయినా వదిలిపెడతారా..? వెంటపడి మరీ చితక్కొట్టి తిక్కకుదురుస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అది ఎక్కడొ కాదు మోదీగారి రాష్ట్రంల గుజరాత్ లోనే జరిగింది. గుజరాత్ వడోదరలో పోలీసులపై రెచ్చిపోయారు స్థానికులు. పబ్లిక్ తో పెట్టుకుంటారా అంటూ దుమ్ముదులిపేశారు. హెడ్ కానిస్టేబుల్ ను తీవ్రంగా కొట్టిన స్థానికులు.. అడ్డుకోవడానికి వచ్చిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ది చేశారు. ఓ బైక్ పై వెళుతున్న వ్యక్తిని అడ్డుకోవడమే ఈ ఘటనకు కారణం.

యోగేశ్ బరియా అనే వ్యక్తిని బండి ఆపి లంచం అడిగాడు హెడ్ కానిస్టేబుల్ శాంతిలాల్ పార్మర్. ఇవ్వడానికి నిరాకరించి ముందుకు అలాగే వెళ్లిపోయాడు బరియా. దీంతో మోటర్ సైకిల్ ను అడ్డుకోవడానికి తన చేతిలోని లాఠీని విసిరాడు. బరియా కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లందరూ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి దిగారు. అతని వెహికిల్ ను తగలబెట్టారు. అయితే పోలీసుల కథనం వేరేలా ఉంది. బరియా బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తుండగా… హెడ్ కానిస్టేబుల్ శాంతిలాల్ పరియా అడ్డుకున్నాడు. ఆపకుండా వెళ్లి… బైక్ పైనుంచి పడిపోయాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో తమ సిబ్బంది తప్పులేదని.. తమపై దాడి చేసిన వారిని గుర్తించి.. చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles