Hackers targetting Iphones

Hackers targetting iphones

Phones, hack, Hakcers, Iphones, IOS, photos, videos,contacts, SMS messages

Mobile phones have become a crucial part of everyone’s lives. People use them to take selfies, get in touch with their loved ones, record videos and store other private information. However, experts warned that UAE consumers, especially those using iPhone gadgets, are prone to cyberattacks and any information about their personal lives, including photos, videos, places they’ve visited, contacts, SMS messages and even corporate data, could easily land in the wrong hands.

ఐఫోన్ వాడుతున్న వారే హ్యాకర్ల టార్గెట్

Posted: 12/29/2015 10:50 AM IST
Hackers targetting iphones

హ్యాకర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. సైబర్ నేరాల్లో బాగా ఆరితేరిన హాకర్లు తాజాగా మెబైల్స్ నుండి కూడా విలువైన, పర్సనల్ సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్ ల నుండి తమకు కావాల్సిన సమాచారాన్ని పొందుతున్నారు. కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, మెసేజ్ లు, వాయిస్ మెయిల్స్, కాంటాక్ట్స్, అడ్రస్ బుక్ ఇన్షర్మేషన్, ఈ మెయిల్, నోట్స్, ఫోటోలు, వీడియోలు, వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ, బ్రౌజర్ బుక్ మార్క్స్, కుకీస్, విజిటెడ్ వెబ్ సైట్స్ తో పాటుగా జియో లొకేషన్ హిస్టరీ ల నుండి తమకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటున్నారు.

ఐఓఎస్ డివైస్, ఐఫోన్ లను టార్గెట్ గా చేసి హ్యాకర్లు యూజర్ల నుండి విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. కాగా బ్యాక్ అప్ ఫైల్స్ నుండి చాలా వరకు హ్యాక్ చేసి.. సైబర్ క్రైం చేస్తున్నారు. అయితే ఐఫోన్ ఒక్కటే కాదు మరికొన్ని ఫోన్లను కూడా హాకర్లు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటివి గతంలో కూడా జరిగినా కానీ ఇలా బ్యాక్ అప్ ఫైల్స్ ను టార్గట్ చెయ్యడం మాత్రం కొత్తగా ఉందని సైబర్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు మరి దీని నుండి సేఫ్ గా ఉండాలంటే ఇవి పాటించండి.

* బ్యాక్ అప్ ఫైల్స్ ను ఎన్ క్రిప్ట్ చెయ్యండి
* ఎప్పుడూ లేటెస్ట్ వర్షన్ సాఫ్ట్ వేర్ లు వాడండి
* మీ ఐఓఎస్ డివైస్ ను కంప్యూటర్ లేదా యుఎస్బి ద్వారా కనెక్ట్ చేసినప్పుడు డైలాగ్ బాక్స్ లో ట్రస్ట్ బటన్ నొక్కకండి.
* మీ మొబైల్ ను ఎప్పుడు రూట్ లేదా జైల్ బ్రేక్ చెయ్యకండి
* మీకు నమ్మకంగా అనిపించిన అప్లికేషన్లను మాత్రమే ఇన్ స్టాల్ చెయ్యండి
* డివైస్ లో ఉన్న అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Phones  hack  Hakcers  Iphones  IOS  photos  videos  contacts  SMS messages  

Other Articles