Thai man arrested for Facebook like

Thai man arrested for facebook like

facebook, Thai Man, Thailand, facebook share, Photo, Like in facebook, Jail for facebook like

A Thai man has been arrested for “liking” a doctored photo of the king and sharing an infographic on Facebook about a growing corruption scandal, as prosecutions burgeon under draconian royal defamation laws.

ఫేస్ బుక్ లో ఫోటో షేర్ చేసినందుకు 32 ఏళ్ల జైలు

Posted: 12/11/2015 01:41 PM IST
Thai man arrested for facebook like

సోషల్ మీడియా వాడుకోన్నోడికి వాడుకొన్నంత అని అందరూ అనుకొంటారు. కొందరు కాలక్షేపానికి, కొంతమంది ఆహ్లాదానికి వాడుతుంటారు. అలా వాడడంలో అత్యుత్సాహంతో చేసే చిన్న చిన్న పొరపాట్లకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలా చేయడంవల్ల థాయ్ లాండ్ కు చెందిన ఓ యువకుడ్ని ఓ ఫోటో జైలు పాలు చేసింది. బ్యాంకాక్ సమీపంలోని సుముత్ ప్రకన్ ప్రాంతానికి చెందిన తణకర్న్ సిరిపై బూన్ అనే యువకుడు డిసెంబర్ 2న ఫేస్ బుక్ లో వచ్చిన ఓ ఫోటోకి లైక్ కొట్టాడు. తమాషాగా ఉందని, ఏదో తన స్నేహితులు చూడడం కోసం ఆ ఫోటోను షేర్ కుడా చేసాడు.

Also Read: ఫేస్ బుక్ ఆఫీస్ లో మెగాపవర్ స్టార్ హల్చల్ 

అయితే.. తణకర్న్ షేర్ చేసిన ఫోటో థాయ్ లాండ్ రాజు భూమిబల్ అదుల్యదెజ్ మార్ఫింగ్ ఫోటో కావడంతో అక్కడి పోలీసులు ఇది గుర్తించి జైలుకు తీసుకువెళ్ళారు. రాజును అవమానించేవిధంగా ఉన్న ఫోటోను లైక్ చేసి, షేర్ చేసినందుకుగాను అతనిపై థాయ్ లాండ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. అలానే ఈ కేసులో అతనికి 32 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అయినా ఇలాంటివన్నీ వారిదేశంలోనే కానీ మన దేశంలో లేవని ఆనందపడతారో.. పాపం లైక్, షేర్ చేసినందుకు పిల్లోడు అన్యాయం అయిపోయాడని బాధపడిపోతారో మీ ఇష్టం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  Thai Man  Thailand  facebook share  Photo  Like in facebook  Jail for facebook like  

Other Articles