TRS playing mind game

Trs playing mind game

TRS, Danam Nagender, Shabbir Ali, GHMC, Hyderabad, KCR, KK, Congress Party

TRS playing mind game congress senior leader Shabbir Ali said. He explains the situation of the TRS party.

ITEMVIDEOS: టిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది

Posted: 12/07/2015 12:59 PM IST
Trs playing mind game

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. దానం నాగేందర్ త్వరలోనే హస్తానికి హ్యాండిచ్చి కారెక్కుతారు అన్న ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పార్టీని వదిలితే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే అని కాంగ్రెస్ నాయకులు బావిస్తున్నారు. అయితే దానం చేరికకు అంతా సిద్దమైనా కానీ కేసీఆర్ సమక్షంలోనే తాను పార్టీలో చేరతానని.. లేకుంటే పార్టీ కూడా మారనని దానం తెగేసిచెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే తాజాగా దానం మీద వస్తున్న పుకార్లను ఖండిస్తు మీడియా ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని.. పార్టీని వదిలిపెట్టే ఆలోచన తనకు లేదని వివరించారు. అయితే దానం నాగేందర్ ఈ ఉదయం షబ్బీర్ అలీతో భేటీ అయ్యారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా దానం నాగేందర్ కు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తరుణంలో దానం కారెక్కుతున్నట్లు వస్తున్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని షబ్బీర్ అలీ అన్నారు. దానం నాగేందర్ తమ పార్టీలో చేరుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఓ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఓడినంత మాత్రాన కాంగ్రెస్ డీలా పడదని షబ్బీర్ అన్నారు. రాజకీయంగా లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Danam Nagender  Shabbir Ali  GHMC  Hyderabad  KCR  KK  Congress Party  

Other Articles