People saw a Lalu in PM

People saw a lalu in pm

Modi, Bihar, Bhola singh, lalu Prasad, Bihar elections, Modi in Bihar, Lalu prasad on Modi

After facing humiliating defeat in the Bihar assembly elections, the BJP is under fire from its own senior party men over its poll campaign led by Prime Minister Narendra Modi. A day after Patna Sahib MP Shatrughan Sinha questioned the party's wisdom to make excessive use of the prime minister in the state Assembly polls, BJP's Begusarai MP Bhola Singh took exception to the language used by Modi and party president Amit Shah at their rallies during the campaigning.

బీహారీలు మోదీలో లాలూను చూశారు

Posted: 11/11/2015 11:48 AM IST
People saw a lalu in pm

బీహార్ ఎన్నికల్లో మోదీ అసలు ప్రధాని లాగా మాట్లాడలేదని.. ఎన్నికల ప్రచారంలో భాగంగా లాలూ ప్రసాద్ లాగా మాట్లాడారని అన్నారు. మోదీ గతంలో చెప్పిన సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ఎక్కడికి పోయిందని ఎంపీ భోలా సింగ్‌ మండిపడ్డారు. బీహార్ లో బిజెపి పార్టీ ఓటమికి కారణాల మీద పార్టీ సమిష్టి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. కానీ నిజానికి మోదీ చరిష్మా, అమిత్ షా చతురత బీహార్ లో పండలేదు. అయితే బీహార్ ఓటమి తర్వాత మోదీ వ్యతిరేక వర్గం విమర్శల దాడికి దిగుతోంది. బీహార్‌లో బిజెపి ఘోర పరాజయం నేపథ్యంలో అగ్రనాయకత్వంపై సొంత గూటి నుంచీ దాడి తీవ్రమైంది. మోడీ అసభ్యకరపదజాలమే బీహార్‌లో ఓటమికి కారణమైందని ఆ పార్టీ ఎంపి ఒకరు ప్రధానిపై మండిపడ్డారు. బీహార్‌ ఎన్నికల్లో బిజెపి ఓటమికి మోడీ సహా అగ్ర స్థాయి నాయకులదే బాధ్యత' అని ఎంపి భోలాసింగ్‌ విమర్శించారు. బీహార్‌లో బిజెపి ఓడలేదు. తనే ఆత్మహత్య చేసుకుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

బీహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన తప్పుల వల్లే పార్టీ ఘోరంగా విఫలమైందని చాలా మంది విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మోడీ విస్తృతంగా పాల్గొన్నప్పటికీ బిజెపి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మోడీ సహా బిజెపి అగ్ర నాయకుల హద్దుమీరిన అసభ్యకర పదజాలమే ఓటమికి ప్రధాన కారణమని మండిపడ్డారు. గోమాంసం అంశం, బిజెపి ఓడితే పాకిస్తాన్‌లో బాణసంచాకాలుతుందన్న అంశం, లాంటి అర్థం లేని అంశాలను ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం వల్లే ఓటమి దరిచేరిందని అని భోలా సింగ్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Bihar  Bhola singh  lalu Prasad  Bihar elections  Modi in Bihar  Lalu prasad on Modi  

Other Articles